పదేళ్ల తర్వాత పెరిగిన రిజిస్ట్రేషన్ వాల్యు

Date:07/08/2019

విజయవాడ ముచ్చట్లు:

రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పెరిగిన భూములు, స్థలాల ధరలు అమల్లోకి వచ్చినట్లే. ఐదు నుంచి పది శాతం మేర భూములు, స్థలాల మార్కెట్ ధరలు పెంచారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఐదు శాతం పెరగగా, పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో పది శాతం వరకు పెరిగింది. ఈ నిర్ణయం ద్వారా రూ.6,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

 

 

ఆగస్ట్ 1వ తేదీ నుంచి పెరిగిన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుంది. దీంతో ముందురోజు వరకు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు కిక్కిరిసిపోయాయి. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం కొన్నేళ్లుగా పెరగలేదు విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో భూములు, ఆస్తుల రేట్లు భారీగా పెరుగుతాయి. గత కొన్నేళ్లుగా ఏపీలో భూముల మార్కెట్ వ్యాల్యూ పెరగలేదు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ, మార్కెట్ వ్యాల్యూకు సంబంధం లేకుండా పోయినట్లుగా చెబుతున్నారు. దీంతో భూముల నుంచి విల్లాల వరకు బ్లాక్‌లో కొనుగోళ్లు చేశారు. మరోవైపు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉంది.

 

 

 

 

అమరావతిలో కోట్లు పలికితే రూ.5 లక్షల వ్యాల్యు ఉదాహరణకు రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఎకరా భూమిని రూ.1 కోటి నుంచి రూ.3 కోట్లకు విక్రయించిన సందర్భాల్లో కూడా రిజిస్ట్రేషన్ వ్యాల్యూ రూ.5-7 లక్షలుగా ఉంది. అలాగే, విజయవాడలో ఓ ప్రాంతంలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు ఉంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూ రూ.15వేలుగా మాత్రమే ఉంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోంది. వ్యాల్యుయేషన్ ఇలా… తగ్గింపు కావాలనుకుంటే ఇలా చేయండి.. పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను పది శాతం వరకు పెంచారు. ఆయా స్థానిక ప్రాంతాల డిమాండును అనుసరించి మార్కెట్ విలువ పెంపుపై జిల్లా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు.

 

 

 

 

నగర, పురపాలక సంస్థలు, మేజర్, మైనర్, పంచాయతీల వారిగా పెంపు ఉంది. పదేళ్ల కింది కట్టడం వరకు వ్యాల్యూలో మార్పు లేదు. దాటితే మాత్రం సంవత్సరానికి ఒక శాతం చొప్పున తగ్గింపు ఉంటుంది. గరిష్టంగా 70 శాతం తగ్గింపు ఉంటుంది. తగ్గింపు కావాలనుకుంటే కార్పోరేషన్ లేదా పురపాలక, మేజర్, మైనర్ పంచాయతీ కార్యాలయాల నుంచి పొందిన సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాలి. నిర్మాణాల వ్యాల్యూయేషన్ ఇలా… నిర్మాణాలు – నగరాలు-పట్టణాల్లో గ్రౌండ్ ప్లస్ టు నిర్మాణాలు చ.అ.కు గత ఏడాది రూ.1,030 ఉండగా, ఆగస్ట్ 1వ తేదీ నుంచి రూ.1,100కు పెంచారు. మేజర్ పంచాయతీలో రూ.910 నుంచి రూ.970కి, మైనర్ పంచాయతీలో రూ.650 నుంచి 700కు పెంచారు. నిర్మాణాల వ్యాల్యూయేషన్ ఇలా…

 

 

 

 

అపార్టుమెంట్స్ అపార్టుమెంట్లలో చ.అ.కు ఇదివరకు రూ.1,110గా ఉంది. ఇప్పుడు రూ.1,190కు పెంచారు. మేజర్ పంచాయతీలో రూ.1,030 నుంచి రూ.1,100, మైనర్ పంచాయతీలో రూ.650 నుంచి రూ.770కి పెంచారు. ఎత్తైన భవనాలకు… ఎత్తైన భవనాలకు చ.అ.కు ఇప్పటి వరకు రూ.1,130గా ఉంటే, ఇప్పుడు రూ.1,210గా ఉంది. మేజర్ పంచాయతీలో రూ.1,010గా ఉన్న ధరను రూ.1,080కి, మైనర్ పంచాయతీలో రూ.720గా ఉన్న ధరను రూ.770కు పెంచారు. అమరావతిలో రెండున్నర రెట్లు మట్టి మిద్దెలకు ఇప్పటి వరకు రూ.340గా ఉండగా రూ.360కి పెంచారు. మేజర్ పంచాయతీలో రూ.20 పెంచి రూ.270కి, మైనర్ పంచాయతీల్లో రూ.10 పెంచి రూ.200గా చేశారు. గోడలు కలిగిన పూరిళ్లు వ్యాల్యూ కూడా రూ.10 పెంచారు.

 

 

 

 

చ.అ.కు రూ.160 నుంచి రూ.170కి పెంచారు. మేజర్ పంచాయతీలో రూ.110 నుంచి రూ.110కి, మైనర్ పంచాయతీలో రూ.80 నుంచి రూ.90కి పెంచారు. కోళ్ల ఫారాల నిర్మాణాలకు చ.అ.కు రూ.560 ఉండగా, ఇప్పుడు రూ.600కు పెంచారు. మేజర్ పంచాయతీల్లో రూ.550 నుంచి రూ.590కి, మైనర్ పంచాయతీల్లో రూ.390 నుంచి రూ.420కి పెంచారు. భూముల వ్యాల్యుయేషన్ రాష్ట్రవ్యాప్తంగా 5 నుంచి 10 శాతం పెంచిన ప్రభుత్వం, రాజధాని అమరావతిలో స్క్వేర్ యార్డుకు రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచింది. అంటే రెండున్నర రెట్లు పెరిగినట్లు.

 

 

గత ప్రభుత్వం భూములను అదే ధరకు (రూ.5,000)కు కేటాయించిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. దేనికి ఎంత శాతం వసూలు చేస్తారంటే.. భూమిని విక్రయించినప్పుడు స్టాంప్ డ్యూటీ కింద ప్రస్తుతం 7.5 శాతం వసూలు చేస్తున్నారు. బహుమతిగా ఇస్తే రెండు శాతం, పార్టిషన్ అయితే ఒక శాతం వసూలు చేస్తున్నారు.

 

 

 

 

మార్కెట్ వ్యాల్యును పెంచినప్పటికీ వీటిని మాత్రం పెంచలేదు. అయితే మార్కెట్ రేటు ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు. ఆగస్ట్ 1 నుంచి మార్కెట్ వ్యాల్యు పెరుగుతుందని తెలిసి భూములు, అపార్టుమెంట్స్ కొన్నవారు జూలై చివరలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టారు.

 

మళ్లీ జనాల్లోకి అయ్యన్న పాత్రుడు

 

Tags: Increased registration value after 10 years

అంతర్జాతీయ హోదా పేరుకు పరిమితమైన బెజవాడ ఎయిర్ పోర్ట్ 

Date:12/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఇటీవలే గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సేవలు రద్దయింది. వయబులిటీ గ్యాప్ ఫండ్ పేరిట.. నష్టాలను భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో.. ఇండిగో సంస్థ సింగపూర్‌కు విమానాలను రద్దు చేసింది. ఇది గన్నవరం నుంచి ఉన్న ఒకే ఒక్క ఇంటర్నేషనల్ సర్వీస్. ఇండిగో నిర్ణయంతో.. అంతర్జాతీయ విమానాశ్రయం హోదా పేరుకు మాత్రమే పరిమితమైంది. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఈ ఎయిర్ పోర్టు ఇక దేశీయ ఎయిర్ పోర్టుగా మాత్రమే మిగిలిపోనుంది. మరోవైపు ఎయిరిండియా సహా మిగిలిన ఎయిర్ లైన్స్ సంస్థలు తమ సర్వీసులను గన్నవరం విమానాశ్రయం నుంచి రద్దు చేస్తున్నాయి.

 

 

 

 

బాబు అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం, సింగపూర్‌ మధ్య విమాన సర్వీసులు నడిచేలా చేశారు. అందుకోసం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పేరిట సీట్లు ఫుల్ కాకపోతే ఆ నష్టాలను తాము భరించేలా.. ఎయిర్ పోర్టులో విమానం నిలిపి ఉంచేందుకు హ్యాంగర్ చార్జెస్ కూడా ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు. సింగపూర్ విమాన సర్వీసులు రద్దయిన తర్వాత.. ఈ సర్వీసులు నడపటానికి నెలకు రూ.3 కోట్లు ప్రభుత్వ భరించాల్సి వస్తోందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 

 

 

 

 

సింగపూర్ విమానాలు నడపటం వల్ల గన్నవరం ఎయిర్ పోర్టుకు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు హోదా వచ్చింది. అందుకే కేంద్ర విమానయాన సంస్థ బెజవాడ ఎయిర్ పోర్టుకు అదనపు సౌకర్యాలు కల్పించింది. అందులో భాగంగా కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్‌లను కేటాయించింది. అలాగే అదనపు నిధులు కేటాయించింది. ఎయిర్ పోర్టుకు విస్తరణకు నిధులు కేటాయించింది. బోయింగ్ 350 కూడా దిగేందుకు వీలుగా భారీ రన్ వే నిర్మించారు.

 

 

 

 

తాజాగా సింగపూర్‌కి విమానాలు నిలిచిపోవడంతోపాటు ఇతర దేశాలకు వెళ్లే విమానాలు ఏవీ లేకపోవడంతో కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది. రాష్ట్రవిభజనకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు చాలా తక్కువగా ఉండేవి. కానీ అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత జనాల రాకపోకలు పెరిగాయి. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఇక్కడి నుంచే పనిచేయడం, ఇతర పనుల కోసం వచ్చేవారితో అమరావతికి రాకపోకలు పెరిగాయి.

 

 

 

 

 

ఎయిర్ లైన్స్ సంస్థలు విమాన సర్వీసులు పెంచాయి. ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. ట్రూజెట్ లాంటి విమాన సంస్థలు సర్వీసులను ప్రారంభించాయి. స్పైస్ జెట్, ఇండిగో లాంటి సంస్థలు గన్నవరం నుంచి ఫస్ట్ ట్రిప్ వేసేలా ఇక్కడే విమానాలను పార్క్ చేసి ఉంచుతున్నాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, తిరుపతి, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, వైజాగ్‌కు రద్దీ పెరిగింది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది.

 

 

 

 

స్పైస్ జెట్ విజయవాడ నుంచి తిరుపతి మీదుగా కొచ్చి సర్వీస్‌ను రద్దు చేయాలని భావిస్తోంది. వైజాగ్‌కు వెళ్లే రెండు విమానాలను ఎయిర్ఇండియా నిలిపివేసింది. హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే విమాన సర్వీసును నిలిపివేసింది. బెంగళూరు సర్వీస్‌ని రద్దు చేసింం‌ది. ఇండిగో కూడా తన సర్వీసులపై పునరాలోచిస్తోంది.

ఉడాకు భారంగా మారుతున్న ట్రై జంక్షన్

 

Tags: Bejawada Airport limited to international designation

చిన్నారులను లైంగికంగా  వేధిస్తే…. అది కట్

Date:01/07/2019

న్యూయార్క్ ముచ్చట్లు:

ఇటీవల చిన్నారులపై ఆకృత్యాలు మితిమీరుతున్న సంగతి తెలిసిందే. అభం శుభం తెలియని చిన్నారులను ఎత్తుకుపోయి దారుణంగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ప్రాణాలు తీస్తున్న రాక్షసులను ఎన్‌కౌంటర్ చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని అలబామా 13 ఏళ్ల లోపు చిన్నారులను లైంగిక వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు HB 379 బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి జైలు శిక్ష విధిస్తారు. శిక్ష పూర్తయిన తర్వాత వారిని పూర్తి నపుంసకులుగా మార్చి జైలు నుంచి విడుదల చేస్తారు. ఇందుకు అంగీకరించనివారిని జైల్లోనే ఉంచుతారు. పెరోల్, బెయిల్ వంటివి ఏవీ ఆమోదించరు. రిపబ్లికన్ స్టేట్ ప్రతినిధి స్టీవ్ హర్స్ట్ మొట్టమొదటిగా ఈ చట్టాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘

 

 

 

 

ఇలాంటి నేరగాళ్ల వల్ల చిన్నారులు జీవితాన్నే కోల్పుతున్నారు. ఈ నేపథ్యంలో దోషులకు విధించే శిక్ష అందుకు సమానంగా ఉండాలి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన రోజు చాలామంది ఇది అమానవీయం అన్నారు. అయితే, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటం కంటే అమానవీయం ఏముందని ప్రశ్నించా. దీన్ని ఎవరైనా అమానవీయం అని అంటే అంతకుమించి అమానవీయత మరొకటి ఉండదు’’ అన్నారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అలబామాకు చెందిన రైమాండ్ జాన్సన్ అనే న్యాయవాది వ్యతిరేకించారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి ప్రస్తుతం విధిస్తున్న శిక్షలు సరిపోతాయని, ఇందుకు కొత్త చట్టం అవసరం లేదని వాదిస్తున్నారు. ఈ విషయాన్ని తాను రాజ్యాంగంలోని 8వ సవరణ కింద ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఇది చాలా క్రూరమైన, అమానవీయ శిక్ష అన్నారు. చేసిన నేరానికి శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఆ నేరగాడు జీవితాంతం నపుంసకుడిగా జీవించాల్సి వస్తుందని జాన్సన్ అంటున్నారు.

స్పందనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు

Tags: If sexually molesting little girls …. cut it

 

 

సేంద్రియ విధానంతో కొత్త పుంతలు

Date:28/06/2019

ఏలూరు ముచ్చట్లు:

రైతులు విక్షణారహితంగా పంటలకు పిచికారి చేస్తున్న పురుగు మందులతో భూమి నిస్సారంగా మారుతోందని ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రభుత్వం పురుగు మందులు అవసరం లేని ప్రకతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని 225 గ్రామాలను ఎంపిక చేసి రైతులతో ప్రకతి వ్యవసాయం చేయించేందుకు అధికారులు సంకల్పించారు. వ్యవసాయాధికారులు సూచనల మేరకు రైతులు కూడా ఆవు పేడ, మూత్రంతోపాటు ప్రకతి సిద్ధమైన కషాయాలతో ఎలాంటి పురుగుమందులు లేకుండా తక్కువ పెట్టుబడులతో ఆరోగ్యకరమైన పంటలను పండించొచ్చు.ఈ పరిస్థితులను అధిగమించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం ప్రకతి సేద్యానికి ప్రాధాన్యమిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నది. ఖర్చు లేని ప్రకతి వ్యవసాయ విధానాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రైతులు ఆచరించేలా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ప్రకతి వ్యవసాయనికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 51 క్లస్టర్ల పరిధిలో 225 గ్రామాల్లో మూడు దశలుగా ప్రకతి వ్యవసాయాన్ని అమలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ ప్రాజెక్ట్‌ అధికారులు, శాస్త్రవేత్తలు ఆర్‌కెవివైవికెవివై కింద ఆయా గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇచ్చి ప్రకతి సేద్యం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా వరి, చెరకు, వేరుశెనగ, కాయగూరలు, పండ్ల తోటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.పెట్టుబడిలేని వ్యవసాయాన్ని సుభాష్‌ పాలేకర్‌ 1998లో రూపొందించారు. అంటే ఎరువులు, క్రిమిసంహారక మందుల కోసం ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. జీవామతం, బీజామతం లాంటివి మాత్రమే వినియోగిస్తారు. ఈ రసాయనాలకు దేశవాళి ఆవు కీలకం. ఒక ఆవు ద్వారా లభించే మూత్రం, పేడతో తయారు చేసే సహజ ఎరువులతో 30 ఎకరాల్లో ప్రకతి సేద్యం చేయవచ్చు.

 

 

 

 

 

 

 

ఉదాహరణకు ఒక ఎకరాలో రసాయనిక ఎరువులు, పురుగుల మందులతో వరి పంటను సాగు చేయడానికి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుండగా, ప్రకతి సేద్యంతో రూ.15 వేలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రకతి సేద్యంతో 5 బస్తాల మేరకు ధాన్యం దిగుబడి పెరిగినట్లు ప్రకతి సేద్యం చేస్తున్న రైతులు చెబుతున్నారు.రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా కేవలం ప్రకతి సంబంధ పదార్థాలతో పంటలను సాగు చేయడాన్ని ప్రకతి వ్యవసాయం అంటారు. దీనికి దేశవాళి ఆవు చాలా ముఖ్యం. ఇది లేకుండా ప్రకతి వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. ఒక్క ఆవుతో 30 ఎకరాల్లో ప్రకతి వ్యవసాయం చేయవచ్చు. దేశవాళి ఆవు మూత్రం, పేడ, పాలు, పుట్టమన్ను, పొడి సున్నం, బెల్లం, పప్పుల పిండి, వేప, సీతాఫలం, ఆముదం, బొప్పాయి ఆకులు, శొంఠిపొడితో పాటు నీరు అవసరం. వీటితో బీజామతం, ద్రవ జీవామతం, ఘన జీవామతం, వేప కషాయం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివి తయారు చేసుకుని నేరుగా చీడపీడల నివారణ మందుగా వినియోగించుకోవాలి.

 

బదిలీలల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు

Tags: New mounds with organic policy

లంగర్‌ హౌస్‌లో రూ.2.4 కోట్లను స్వాధీనం

Date:09/04/2019
 హైదరాబాద్‌ ముచ్చట్లు :
 మంగళవారం ఉదయం లంగర్‌ హౌస్‌లో రూ.2.4 కోట్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదును కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నగదును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.. నారాయణగూడలో రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్న మరుసటి రోజే పెద్ద మొత్తం లో డబ్బు పట్టుబడింది.
Tags:Rs 2.4 crore was seized in Langar House

సీబీడీటీ ఛైర్మన్‌, రెవెన్యూ సెక్రటరీకి ఈసీ పిలుపు

Date:09/04/2019
ముంబయి  ముచ్చట్లు :
ఇటీవల ఆదాయపు పన్నుశాఖ దాడులపై కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై మాట్లాడేందుకు సీబీడీటీ ఛైర్మన్‌, రెవెన్యూ సెక్రటరీలను కేంద్ర ఎన్నికల సంఘం పిలిచింది. దీంతో రెవెన్యూ సెక్రటరీ పాండే, సీబీడీటీ ఛైర్మన్‌ పి.సి.మోడే నేడు ఈసీ వద్దకు వెళ్లనున్నారు. భాజపా వివిధ శాఖలను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. దీంతో ఇప్పటికే ఆదివారం ఈసీ దీనిపై స్పందిస్తూ ఆర్థిక శాఖకు సూచనలు జారీ చేసింది. ఆ శాఖకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు దాడులు ఏవైనా నిష్పాక్షికంగా చేయాలని, వేధింపులు వద్దని సూచించింది.ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఐటీ శాఖ పలువురు నేతలపై దాడులను నిర్వహించింది. దీంతో తమను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని విపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. లెక్కలు చూపని రూ.281 కోట్లను సోమవారం ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకుంది.
Tags:CBDT Chairman, Easy Calling Revenue Secretary