పాపం… పాల్…

Date:20/05/2019

విజయవాడ ముచ్చట్లు:

ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి.. పలు సంస్థలు చేసిన సర్వేల ప్రకారం తమ ఫలితాలను వెల్లడించాయి.. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే సరికి జగన్ కి అత్యధిక మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పింది . ఈ సారి చంద్రబాబుకి ప్రతిపక్షం తప్పదు అని అన్ని సర్వేలు తెల్చేసాయి … ఇక జనసేన ప్రభావం ఈ సారి ఏ మాత్రం లేదనే మాట ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటేనే అర్ధం అయిపోతుంది … ఒక్క లగడపాటి మాత్రమే ప్రజారాజ్యం కంటే జనసేనకి ఎక్కువ సీట్లు రావని కానీ పవన్ గెలవడం మాత్రం ఖాయమని స్పష్టం చేసారు . కానీ అయన ఎక్కడి నుండి గెలుస్తాడు అన్న దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు . ఇక కాంగ్రెస్ మరియు బిజీపి పార్టీలకి రెండు శాతం ఓట్లు రావని తెల్చేసాయి .. ఇంకా ఇవే కాకుండా ప్రముఖ క్రైస్తవ మత ప్రభోదకుడు మరియు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఎ పాల్ గురించి సర్వే సంస్థలు పట్టించుకున్న పాపాన పోలేదు.. అయన ప్రచార సమయంలో భాగంగా నేనే ఏపికి కాబోయే సీఎం అన్ని చెప్పుకొచ్చారు .

 

 

 

 

ఇప్పుడు అయన పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ సర్వే సంస్థ కూడా చెప్పడం పక్కన పెడితే ఆయనది ఓ పార్టీ ఉన్నది అన్న విషయాన్ని కూడా గుర్తించలేదు .. ప్రస్తుతం పాల్ నర్సాపురం ఎంపీగా పోటిలో ఉన్నారు .. ఆయన పార్టీ పై మరియు అయన గెలుపు గురించి పూర్తి స్పష్టత రావాలంటే ఈ నెల 23 వరకు ఆగక తప్పదు అన్నమాట .

 

 

ఈ పాస్ ద్వారానే సన్నబియ్యం సరఫరా

 

Tags: Sadly … Paul …