ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం

Date:09/08/2019

తిరుపతి ముచ్చట్లు:

అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవ వేడుకలు తిరుపతి గిరిజన భవన్‌లో నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా , ఆర్‌డివో కనకనరసారెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి అబ్సాలోము, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్మానటరింగ్‌ కమిటి సభ్యులు డాక్టర్‌ బాణావత్‌మునీంద్రనాయక్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాణావత్‌ మునీంద్రనాయక్‌ మాట్లాడుతూ అరకులో మల్టీసూపర్‌స్పెషాలిటి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, గిరిజన భవన్‌కు కావాల్సిన వసతులు కల్పించాలని కోరారు. అలాగే తాండాలలోని గిరిజనులకు స్మశానవాటికలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని 40 వేల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు బివి.నాయక్‌, సుద్దాల సుబ్రమణ్యం, హనుమంతనాయక్‌, గుండాలనాయక్‌, వంసతమ్మ, సరస్వతమ్మ, కళావతి, చిరంజీవి, సురేష్‌నాయక్‌, అక్కులప్పనాయక్‌, హరినాయక్‌, చలపతినాయక్‌ , వరదరాజులతో పాటు అధిక సంఖ్యలో గిరిజనులు హాజరైయ్యారు.

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే పల్లెబాట

Tags: International Adivasi Day

అక్రెడిషన్ హోల్డర్స్ కు వీఐపీ బ్రేక్ దర్శనము అనుమతి!

Date:26/06/2019

తిరుమల  ముచ్చట్లు:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో  అక్రెడిషన్ కలిగిఉన్న జర్నలిస్టుల అందరికి వీవీఐపీ బ్రేక్ దర్శనం  కలిగిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నూతనంగా చైర్మెన్ బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డి గారిని, జర్నిలిస్ట్ సంఘాల జేఏసీ నేత జోగినాయడు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ బృంద సభ్యులు కలిసారు మీ హయాంలో జర్నలిస్ట్ లకు టీటీడీ లో విఐపి బ్రేక్ దర్శనం సౌకర్యం కల్పించాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే టీటీడీ బోర్డ్ మీటింగ్ లో జర్నలిస్ట్ సమస్య కు అధికారక ఆమోదం తెలుపుతామని అన్నారు.

 

 

ఇండియాలో ముందుగానే విడుద‌ల‌వుతున్న `స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం`

Tags: VIP Break-Ahead for Accreditation Holders Approved!

బాలల హక్కులకు భంగం కలిగించరాదు

– న్యాయమూర్తి బాబునాయక్‌

Date:12/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలో చిన్నపిల్లల హక్కులకు ఎవరు భంగం కలిగించినా శిక్షాఅర్హులౌతారని పుంగనూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని నక్కబండ పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్‌ మాట్లాడుతూ పసిపిల్లలను ప్రతి ఒక్కరు పాఠశాలలకు పంపించాలని సూచించారు. ముఖ్యంగా పట్టణాలలో చిన్నపిల్లలను పనులకు వివిధ రకాలుగా వినియోగించుకుంటు బాలకార్మికులుగా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పసిపిల్లలను పనులకు పంపినా, పనుల్లో వినియోగించిన ఇద్దరిపైన చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాలల హక్కులకు ఎవరు భంగం కలిగించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏజిపి ప్రభాకర్‌నాయుడు, తహశీల్ధార్‌ మాదవరాజు, కో-ఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల జాబితా విడుదల

Tags: Child rights should not be disturbed

చంద్రబాబు కు సిగ్గు రావడం లేదు

Date:21/05/2019

విజయవాడ  ముచ్చట్లు:

ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో పిల్లి మొగ్గలు వెశారు. చంద్రగిరి రీపోలింగ్ పై అన్యాయం అక్రమం అని ఎంత అరిచిమా కోర్టు ముట్టికాయలు వేసిందని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.  మంగళవారం అయన మీడియతో మాట్లాడారు. వివిప్యాడ్ల విషయంలో సుప్రింకోర్టు తిరస్కరించినా చంద్రబాబుకు సిగ్గు రావడంలేదు. చంద్రబాబుకు ప్రజాస్వామ్య స్పూర్తి లేదు. చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఓ తుంటరి ఆటగాడిలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు ఎవ్వరి పై నమ్మకం లేదు.  ఆయనను ఆయనే నమ్మడు. తాను చెడ్డ కోతి వనమల్లా చెరిచినట్లు చంద్రబాబు దేశ మంతా తిరిగి వారిని బ్రష్టు పట్టిస్తున్నాడని అన్నారు.చెడ్డ రాజకీయవేత్త చంద్రబాబు  వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నాడు.

 

 

 

 

 

 

మే23న ఫలితాలు కూడా నమ్మడు చంద్రబాబు. కౌంటింగ్ సమయంలో అరాచక వాదన వినిపించడానికి గ్రౌండ్ లెవల్ వర్క్ చేస్తున్నాడు. ప్రజాదరణ లేదనే ఓటమి భయంతో ఇవియం లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద టిడిపి గందరగోళానికి తెగబడిద్ది.  వైసిపి కారకర్తలు సమ్యమనం పాటించండని సూచించారు. 23న చంద్రబాబు ఓటమిపాలవక తప్పదు. అత్యున్నత న్యాయస్దానం తీర్పు ఇచ్చిన తరువాత మళ్ళీ ఎన్నికల కమీషన్ ముందు ధర్నా చేస్తానంటున్నాడు.  చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలులు ఉన్నాయా అని ప్రశ్నించారు. దేవినేని ఉమా పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు. తొడలు కొడితే నీ తొతడలే వాస్తాయి బ్రదర్ అంటే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు అంబటి కౌంటర్ ఇచ్చారు.   హూందాగా వ్యవహరించండి. వేలకోట్లు మెక్కారు. మొత్తం కక్కిస్తామని అన్నారు.

 

యువత కు ఓటు హక్కు కల్పించింది..రాజీవ్ గాంధే

 

Tags: Chandrababu does not get shy

ఈసీ విధులను తన చేతుల్లోకి తీసుకోవడం విడ్డూరంగా  ఉంది

Date:25/04/2019
గుంటూరు  ముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ విధులను కూడా సీఎస్ తన చేతుల్లోకి తీసుకోవడం విడ్డూరంగా  ఉంది. సీఎస్  తీరు  రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని మంత్రి నక్కా అనంద్ బాబు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికల ప్రక్రియ చూడలేదు. వీళ్ళ వ్యవహారాలు చూస్తేంటే  ఏదో కుట్ర జరుగుతుందని తెలుస్తుంది. మోడీ, కేసిఆర్, జగన్ లు కలసి చంద్రబాబు పై కుట్ర పన్నారు.  టిడిపి ఫిర్యాదు చేస్తే ఈసీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ2 విజయ సాయి రెడ్డి నోటి నుంచి మాట రాగానే ఈసి చర్యలకు సిద్దమౌతుందని ఆరోపించారు. పోలింగ్ రోజున ఎన్నో కుట్రలు చేశారు.  మరల కౌంటింగ్ రోజు కూడా కుట్రలకు సిద్దం అవుతున్నారు. మోడి ని నమ్ముకున్న జగన్ నట్టేట మునగబోతున్నాడు. ఏపికి ఆర్దిక నేరాలు పరిచయం చేసిన గజదొంగ విజయసాయి రెడ్డి. విజయ సాయి సలహా లతో వైఎస్ కుటుంబం రాష్టాన్ని సర్వనాశనం చేసింది. సీఎస్ ద్వారా ప్రజలకు అందాల్సిన పధకాలకు ఆటంకం కల్గిస్తున్నారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబు ను సీఎంగా  ఎన్నుకున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం ను సీఎస్ గా ప్రజలు ఎన్నుకోలేదు. ఎల్వీ సుబ్రమణ్యం తో చెప్పుంచుకునే స్దితిలో చంద్రబాబు లేడు. కేంద్రం లో మోడి అన్ని సమీక్షలు చేస్తుంటే లేని తప్పు , ఏపిలో ప్రజా సంక్షేమం పై సమీక్షలు చేస్తా తప్పా అని ప్రశ్నించారు. కేంద్రం లో బిజెపి అడ్రస్ లేకుండా పోబోతుంది.  ఏపిలో టిడిపి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని మంత్రి అన్నారు.
Tags:It is a great deal of sees taking in his hands

ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తాం

Date:18/04/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడుగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. అలాగే దివంగత అధ్యక్షుడు ఎస్‌పి.మునస్వామిశెట్టి ఆశయాల మేరకు కార్యక్రమాలను అందరి సహకారంతో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు వాసవిదేవిని ప్రార్థించి, ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు విజయకుమార్‌, నూతన కార్యదర్శులు ఆర్‌వి.బాలాజి, ఇట్టాబానుప్రకాష్‌, దొంతి రాజేందప్రసాద్‌తో పాటు పిఎల్‌.శ్రీధర్‌, రంగనాయకులు, సుంకు ప్రవీన్‌కుమార్‌, దొంతి వెంకటేష్‌బాబుతో పాటు కార్యవర్గ సభ్యులు కాశిప్రసాద్‌, జనార్ధన్‌శెట్టి, సత్యనారాయణగుప్తా, దశరథరామయ్యశెట్టి, సుదర్శన్‌గుప్తా, లక్ష్మినరసింహాం, శ్రీనాథ్‌, రాము, రాజన్నశెట్టి, సుబ్రమణ్యంబాబు, లక్ష్మిపతి, వేముల శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

 

 

న్యాయస్థానాలకు సాక్ష్యాలు అవసరం

 

Tags: We will work for the development of Aryans

అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ రద్దు

-హోం గార్డులకు మెరుగైన జీతాలు
-చిరు వ్యాపారులకు.. ఐడీ కార్డులు. రూ.10 వేల వడ్డీ లేని రుణం
-అదోని సభలో  వైయస్ జగన్ వెల్లడి
Date:25/03/2019
అదోని ముచ్చట్లు:
ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హమీనిచ్చారు. ఉద్యోగులు కోరుతున్నట్లుగా 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని, సకాలంలో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని, సర్వీసు, విద్యార్హతల ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, ఔట్ సోర్సింగ్లో పని చేస్తున్న వారికీ న్యాయం చేస్తూ, సమానపనికి సమాన వేతనాలు చెల్లిస్తామని, పెన్షనర్ల కోసం ప్రతి జిల్లాలో ఒక సెల్ చేస్తామని జగన్ ప్రకటించారు. అదే విధంగా పోలీసు బాస్ లకు చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలు విప్పుతామని, పోలీసులకు వీక్ ఆఫ్ అమలు చేస్తామని, హోం గార్డులకు మెరుగైన జీతాలు ఇస్తామని ఆయన వెల్లడించారు.రోడ్ల పక్కన, ఫుట్పాత్లపైనా చిరు వ్యాపారం చేసుకుంటూ ఎందరో జీవిస్తున్నారని, అలాగే ఎందరో వృత్తిదారులు ఫుట్పాత్లను నమ్ముకుంటూ బతుకుతున్నారని  జగన్ తెలిపారు. వారంతా పెట్టుబడిగా రూ.1000, రూ.2 వేలను కూడా రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీతో తెచ్చుకుంటున్నారని ఆవేదన చెందారు. అందుకే వారి కష్టాలు తీరుస్తూ, చేయూతనిచ్చే విధంగా వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇస్తామని జననేత ప్రకటించారు.
కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఉదయం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పట్టణంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.అదోని నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, పట్టణంలో నాలుగు రోజులకోసారి నీరిస్తున్నారని, ఇక గ్రామాల్లో వారానికోసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. 5 ఏళ్లుగా పరిస్థితి ఇదీ అని అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.ఇదే అదోనిలో గతంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ను మహానేత వైయస్సార్ కట్టాడని, అదే విధంగా అదోనిలో తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు చేపట్టి, మూడు బిట్లు పూర్తి చేయగా, మిగిలిన బిట్టును ఎవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.అదోని రెవెన్యూ డివిజన్ అయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదని, ఉన్న ఒక ఎయిడెడ్ కళాశాలలో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో పిల్లలకు చదువు ఎండమావిలా మారిందని చెప్పారు.ఇక్కడి ఏరియా ఆస్పత్రిలో 14 మంది వైద్యులకు బదులు, కేవలం 5గురు మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు.
తుంగభద్ర లోలెవెల్ కాలువ ఆధునీకరణ కోసం రూ.175 కోట్లు కేటాయించిన మహానేత వైయస్సార్, అప్పట్లోనే రూ.75 కోట్ల పనులు పూర్తి చేయగా, ఆ మిగిలిన పనులను చంద్రబాబు చేపట్టలేదని చెప్పారు. దీంతో ఈ ఏడాది తుంగభద్రలో నీరున్నా రబీలో సాగు లేదని గుర్తు చేశారు. మైనారిటీలకు ఈద్గా సమస్య ఉందని, అయినా దాన్ని పరిష్కరించాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని ఆక్షేపించారు.తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే, 2.65 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు, రెండు జిల్లాలలో 650 గ్రామాలకు మేలు జరుగుతుందని, ఇంకా లక్షల మందికి తాగు నీరివ్వొచ్చని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు ఆ ప్రాజెక్టును అస్సలు పట్టించుకోలేదని అన్నారు. 2014, ఆగస్టు 15న కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని ప్రకటించినా, ఈ 5 ఏళ్లు దాన్ని పట్టించుకోలేదని చెప్పారు. కానీ, ఎన్నికలు రావడంతో గత నెల ఇక్కడికి వచ్చి ప్రాజెక్టు పనులకు టెంకాయ కొట్టాడని ఆక్షేపించారు.చంద్రబాబు ప్రతి అడుగులో మోసం, దగా, వంచన కనిపిస్తాయని, సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడవడంలో ఎందుకు వెనుకాడుతాడని అన్నారు.
దేశంలోనే కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువని, కానీ గత 5 ఏళ్లుగా ఆ ఉల్లికి ధర రాక, పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారని చెప్పారు. ఇక్కడ కిలో ఉల్లికి కనీసం రూ.1.50 గిట్టుబాటు కాకున్నా, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్లో కిలో ఉల్లి రూ.23 కి అమ్ముతున్నారని, ఆ విధంగా దళారుల దోపిడి సాగుతోందని తెలిపారు. దళారీలను కట్టడి చేయాల్సిన చంద్రబాబు స్వయంగా వారికి నాయకుడిగా మారారని ఆరోపించారు. ఉల్లి, టమోటాతో పాటు, పత్తి ధరలు కూడా అలాగే దారుణంగా ఉన్నాయని వివరించారు. వారితో పాటు, కుల వృత్తుల వారు, రోడ్డు పక్కనే ఉన్న కుమ్మరులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, చెప్పులు కుట్టుకునే వారు కావచ్చు.. అందరికి ఒకే మాట చెబుతున్నానని అన్నారు.గుర్తింపు కార్డులు–రుణం‘మీ సమస్యలు చూశాను. దగ్గర నుంచి విన్నాను. మీ అందరికీ నేను ఉన్నాను. అందుకే మీ అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాను. రోడ్డు పక్క చిరు వ్యాపారం చేసుకుంటున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం ఇస్తాము’ అని శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు.దారి పొడవునా కష్టాలు, బాధలు వింటూ నడిచానని, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం చూస్తున్న వారిని చూశానని, నవరత్నాలు ద్వారా వారందరికీ మేలు చేస్తానని వెల్లడించారు.
Tags: The CPS cancels as soon as the power is taken

నారాయణరెడ్డి హత్య కేసు సుప్రీంకోర్టులో కొట్టివేత

Date:11/03/2019
మద్దికేర ముచ్చట్లు:
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసును సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసిందని మద్దికేర ఎంపీపీ పద్మావతి,  మండల మాజీ కన్వీనర్ ధనుంజయ తెలియజేశారు. సోమవారం మీడియాతో వారు మాట్లాడారు.  గత ఏడాది మే 21 న  చెరుకులపాడు నారాయణరెడ్డిని క్రిష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద కొందరు వ్యక్తులు హత్య చేశారని,ఈ కేసుకు సంబంధించి పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కె.ఇ శాం బాబును ముద్దాయిగా చార్జిషీటులో చేర్చడం జరిగిందని వారు తెలియజేశారు. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో చార్జిషీట్ నుండి శ్యాం బాబు పేరు తొలగించడం జరిగిందన్నారు. తదనంతరం నారాయణరెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి   డోన్ కోర్టులో ప్రైవేటు కేసు వేసిందని, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును న హై కోర్ట్ కేసును కొట్టివేసిందని తెలియజేశారు. అనంతరం చెరుకులపాడు శ్రీదేవి సుప్రీం కోర్టును ఆశ్రయించిన తర్వాత వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పుని బలపరిచి చెరుకులపాడు శ్రీదేవి వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టివేసిందని వారు తెలియజేశారు. శ్యాం బాబు పై ఉన్న కేసు కొట్టివేయడంతో కేఈ అనుచరులు మరియు టిడిపి నాయకులు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.
Tags:Narayana Reddy murder case in the Supreme Court