వర్థక వ్యాపారులచే ముస్లింలకు ఇఫ్తార్‌ విందు

Date:25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని వర్థక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి , కార్యదర్శి అర్షద్‌అలి , చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడు ఇట్టా బానుప్రకాష్‌శెట్టి ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. పట్టణంలోని ముస్లిం సోదరులు ఇఫ్తార్‌ విందుకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వెంకటాచలపతిశెట్టి, బానుప్రకాష్‌శెట్టి కలసి ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు ఖాదర్‌, మస్తాన్‌, ముస్తఫా, బాబు, అల్లాభక్షు తదితరులు పాల్గొన్నారు.

 

పతుల కోసం సతుల ప్రచారం

 

Tags: Iftar feast for Muslims by the merchants

బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి

Date:19/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు గాయత్రిమాత తాలూక బ్రాహ్మణ సంఘ సమావేశం ఆదివారం సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణరావు , కార్యదర్శి కోదండ రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలో స్మశానవాటిక ఏర్పాటు చేసి, అందులో కర్మకాండలకు భవనం నిర్మించే విషయమై చర్చించారు. అలాగే బ్రాహ్మణుల మఠం దురాక్రమణపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయమై చర్యలు తీసుకుంటామన్నారు.

జూన్‌ 9న బ్రాహ్మణ సంఘ సమావేశం..

బ్రాహ్మణ సంఘ జనరల్‌బాడి సమావేశం జూన్‌ 9న ఉదయం 9 గంటలకు హరిహరమఠంలో నిర్వహించేలా సమావేశంలో తీర్మాణించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ తాలూక బ్రాహ్మణ సంఘ జనరల్‌బాడి సమావేశానికి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు హాజరై, జయప్రదం చేయాలని కోరారు. ఈసమావేశంలో సంఘ ప్రతినిధులు డాక్టర్‌ రమణ్‌రావు, మురళి, క్రిష్ణమూర్తి, సోమశేఖర్‌, రామక్రిష్ణ, మదు, అశ్వర్థ, సుధాకర్‌, ఉదయ్‌కుమార్‌, ప్రకాష్‌, రాజేష్‌, కుమార్‌, గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు మున్సిపాలిటిలో రిజర్వేషన్ల జాబితా సిద్దం

 

Tags: Working for the development of Brahmins

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాక

Date:18/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని ముస్లిం సోదరులతో ఆదివారం రాత్రి ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారు. అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు షా , కార్యదర్శి అమ్ము, సంఘ వైస్‌ ప్రెసిడెంట్‌ జాఫర్‌ఖాన్‌, ఎంఏఎన్‌ నూరుల్లా, ఇస్మయిల్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ ఏర్పాటు చేశారు. అలాగే సంతగేటులో కూరగాయల వ్యాపారులు , చింతపండు వ్యాపారులు షామీర్‌, అంజాద్‌, హైదర్‌ కలసి ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేశారు. ఈ రెండు కార్యక్రమాలలోను ఎమ్మెల్యే పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలపనున్నారు.

20న విశ్రాంత ఉద్యోగుల సమావేశం

 

Tags: Today MLA Peddireddy arrives

పుంగనూరు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా పులిరామక్రిష్ణారెడ్డి

Date:29/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు న్యాయవాదుల సంఘ ఎన్నికలు శుక్రవారం జరిగాయి . నూతన న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా పి.పులిరామక్రిష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. కార్యదర్శిగా కెవి.ఆనంద్‌కుమార్‌, జాయింట్‌సెక్రటరీగా ఎస్‌.అయూబ్‌బాషా, ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ.జమీల్‌, ట్రెజరర్‌గా ఎలినార్‌ ప్రశాంతి, స్పోడ్స్ సెక్రటరీగా సివి.రమేష్‌బాబు ఎంపికైయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా బి.వెంకటమునియాదవ్‌, పిఎన్‌.బాలాజి కుమార్‌, ఆకుల చెన్నకేశవులు, ఎ.వెంకటపతి, ఎన్‌.రెడ్డెప్ప, వై.భాస్కర్‌రెడ్డి, ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తూ లోక్‌ అదాలత్‌ల ద్వారా కేసులు సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

నోటా కే మా ఓట్లు : మంద కృష్ణ మాదిగ

Tags; Puliarama Krishna Reddy is the chairman of the Punganuru Advocates Association

ఎంఆర్‌పిఎస్‌ ఛలో అమరావతి కరపత్రాలు విడుదల

Date:12/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

 

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఛలో అమరావతి కార్యక్రమాన్ని ఈనెల 19న చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి, జిల్లా కోశాధికారి నరసింహులు ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మిద్దింటి వెంకటస్వామి మాట్లాడుతూ అమరావతిలో ఈనెల 19న 10 లక్షల మందితో మందక్రిష్ణ మాదిగ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మారుమూల గ్రామం నుంచి ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో మాదిగలను తరలిస్తామన్నారు. సభను విజయవంతం చేసి, రిజర్వేషన్‌ సాధించేందుకు మాదిగల సత్తా చాటుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్‌ను జనాభా దామాషా పద్దతిలో అమలు జరపాలని , ఎన్నికల హామిలను నిలబెట్టుకోవాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌, విశ్వనాథ్‌, విజయకుమార్‌, ఆంజప్ప, రామయ్య, అలివేలమ్మ, నాగరత్న, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

హంద్రీనీవా కాలువలో మతపెద్దలచే పూజలు

 

 

Tags: MRPS chalo is released by Amravati pamphlets