క‌వచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం

Date:14/07/2019

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం ఘనంగా ముగిసింది.ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు క‌వ‌చాల‌ను ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ త‌రువాత శతకలశ స్నపనం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని కల్యాణమండపంలోకి వేంచేపు చేసి వేడుక‌గా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. క‌వ‌చ ప్ర‌తిష్ట‌, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వ‌హించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.

 

 

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఇవో  ర‌వికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు  జ్ఞానప్రకాష్‌,  శ్రీ‌హ‌రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  కృష్ణమూర్తి,  ప్ర‌శాంత్‌, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

 

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో వైభ‌వంగా గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ వైభ‌వంగా జరిగింది. ఇందులోభాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు.

ఉదయం హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాత్రి 8.30 గంటల వరకు యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు ఒక రోజు పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈఓ  సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్  రాజ్‌కుమార్‌, అర్చ‌కులు  ఉద‌య‌శంక‌ర్ గురుకుల్‌,  స్వామినాథ గురుకుల్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రెడ్డిశేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు

Tags: Shri Govindarajaswamy’s First Birthday Concert