పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు

– కమిషనర్‌ వర్మ

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో పారిశుద్ధ్యం , పర్యావరణ కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నూతన కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శనివారం ఆయన ఉదయం నుంచి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా మురుగునీటి కాలువలను, చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దోమలు ప్రభలకుండ బ్లీచింగ్‌, ఫినాయిల్‌ స్ప్రే చేయించారు. అలాగే ఉదయం ఫాగింగ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్భంధిగా నిర్వహిస్తామన్నారు. రోడ్లపై చెత్త పడవేసినా, బహిరంగ మలమూత్ర చేపట్టినా జరిమానాలు విధిస్తామన్నారు. అలాగే పట్టణంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్లాస్టిక్‌ వినియోగాలను పూర్తిగా నిషేధించామన్నారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా విక్రయించినా, వినియోగించిన క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు , రోడ్లకు ఇరువైపులా వెహోక్కలను పూర్తి స్థాయిలో నాటించి, వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్భంధిగా అమలు చేసేందుకు ప్రజలందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు.

14న రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గ స్వీకారం

Tags; Special measures on sanitation