వైఎస్సార్సీపి గెలవడంపై ముస్లింల సంబరాలు

Date:26/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో వైఎస్సార్సీపి విజయం సాధించడం , పుంగనూరులో వైఎస్సార్సీపి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గెలుపొందడం పట్ల పట్టణంలోని ముస్లింలు సంబరాలు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ముస్లిం మైనార్టీ నాయకులు అయూబ్‌ఖాన్‌, ముతవల్లి అజీజ్‌, ఇంతియాజ్‌ ఆధ్వర్యంలో ఎంబిటి రోడ్డులో ప్రజలకు లడ్డూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు షా, కార్యదర్శి అమ్ము పాల్గొన్నారు. 500 మందికి లడ్డూలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు వైఎస్సార్సీపి జిందాబాద్‌…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ముస్లిం మైనార్టీలు వైఎస్సార్సీపికి పూర్తిగా మద్దతు ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీలకు రాష్ట్రంలోనే ఎంతో గుర్తింపు లభించిందని కొనియాడారు. షాదీమహాళ్లు, మసీదుళ్ల మరమ్మతులకు తన సొంత నిధులు కేటాయిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంభానికి ఎల్ల వేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కెపి.ఖాజా, ఎంఎస్‌.సలీం, ఎస్‌ఏబి అఫ్జల్‌, ఎంకెబి హర్షద్‌, కిజర్‌ఖాన్‌, అఫ్సర్‌, మస్తాన్‌, సల్మాన్‌ఖాన్‌ , అంజాద్‌, , నూరుల్లా, ముష్టాక్‌, నిజాం, సర్ధార్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

జగనన్న రాకతో …పేదల ముంగిటకు నవరత్నాలు

 

Tags: Celebration of Muslims on YSRCP