వెంకన్న సన్నిధిలో సీఎం కేసీఆర్

Date:27/05/2019

తిరుమల  ముచ్చట్లు:

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం వెళ్లి శ్రీవారిని దర్శించుకుని కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. మళ్లీ రెండవసారి  శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చారు. అంతకుముందు తిరుమలలోని శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్దకు కేసీఆర్ చేరుకోగా, ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టీ స్వాగతం పలికారు. ఆపై కాసేపు సేదదీరిన తరువాత, శ్రీవారి పాదాలు, శిలాతోరణం తదితర ప్రాంతాలను కేసీఆర్, ఆయన వెంట వచ్చిన కుటుంబ
సభ్యులు దర్శించుకున్నారు వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కుడా ఆలయ మహా ద్వారం వద్ద స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్  కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి చిత్ర పటంతో తో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.. తరువాత కేసీఆర్ తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ప్రత్యేక పూజలు చేశారు… తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామిని కుడా
కేసీఆర్ దర్శించుకున్నారు.

 

సత్య దేవుడి ఆలయంలో డ్రెస్ కోడ్ తప్పనిసరి

Tags: CM KCR in Vennkanna Sannidhi