మోడీ,జగన్ లకు కేసీఆర్ అభినందనలు

Date:23/05/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

లోకసభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ఘనవిజయం దిశగా దూసుకెళ్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు
మెరుగవుతాయని ఆకాంక్షించారు.

టీడీపీనీ ఓడించిన జగన్

Tags: Congrats for Modi and Jagan