గులాబీకి దగ్గరవుతున్న ఎంపీ

Date:19/08/2019

నల్గొండ ముచ్చట్లు:

తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు మొదట రాజకీయంగా బలపడాలని భావిస్తున్న బీజేపీ… అందుకోసం పెద్ద ఎత్తున చేరికలను ప్రొత్సహిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను

తమ పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ… వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదగాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, టీడీపీలోని కీలక నేతలను తమ పార్టీలో

చేర్చుకోవాలని భావిస్తుందా అనే చర్చ మొదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కావడమే ఇందుకు కారణం. యాదాద్రిలో

పర్యటించిన కేసీఆర్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేసీఆర్‌ను ఎంపీ కోమటిరెడ్డి కలవడంలో పెద్దగా ప్రాధాన్యత లేదని ఆయన

వర్గం చెబుతోంది. అయితే కేసీఆర్‌ను మరికొద్ది రోజుల్లోనే మళ్లీ కలిసి ఆలేరు, భువనగిరి సమస్యలపై చర్చిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. తనతో పాటు తన సోదరుడు ఎంపీ వెంకట్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని ఆయన

పలుసార్లు చెప్పారు. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. అయితే ఉన్నట్టుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్‌ను కలవడం

రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలోకి వెళ్లడం ఇష్టంలేని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… టీఆర్ఎస్ వైపు చూస్తున్నారేమో అనే ప్రచారం సాగుతోంది.

 

సుజన..భజనపైనే చర్చంతా

Tags: The MP who is close to the rose

జార్ఖండ్, హర్యానాలపై ఎవరి లెక్కలు వారివే

-త్రిముఖ పోటీలో విజేతలు ఎవరు

Date:13/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో జరగనున్న హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, జేయూఎం పార్టీలు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. హర్యానాలో కాంగ్రెస్, జార్ఖండ్ లో ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నాయి. అధికారాన్ని రెండు రాష్ట్రాల్లో కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, జేఎంఎ: శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి.

 

 

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికారాన్ని సాధించడం పక్కన పెడితే గౌరవ ప్రదమైన స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, జేఎంఎం పనిచేస్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉండే హర్యానాపై అందరి దృష్టి ఉంది. హర్యానా పేరు చెప్పగానే దేవీలాల్, భజన్ లాల్, బన్సీలాల్ గుర్తుకు వస్తారు. ఈ లాల్ త్రయం రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు శాసించింది. దేవీలాల్ జనతాదళ్ హయాంలో ఉప ప్రధానిగా, బన్సీలాల్ 70ల్లో కాంగ్రెస్ హయాంలో రక్షణమంత్రిగా చక్రం తిప్పారు. భజన్ లాల్ కేంద్రంలో పనిచేయనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సత్తా చాటారు.

 

 

 

 

దేవీలాల్, బన్సీలాల్ కూడా సీఎంగా చక్రం తిప్పారు. ప్రస్తుతం భజన్ లాల్ , బన్సీలాల్ వారసులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాల్లో లేరు. దేవీలాల్ వారసులు మాత్రం క్రియాశీలకంగా ఉన్నారు. దేవీలాల్ వారసులు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పేరుతో పార్టీని నడిపిస్తున్నారు. ఆయన తనయుడు ఓంప్రకాశ్ చౌతాలా 1999 నుంచి 2005 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఇరుక్కుని ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. చౌతాలా తనయుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు.

 

 

 

2014 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాలు, 33.2 శాతం ఓట్లు సాధించి అధికారాన్ని అందుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేసిన మనోహర్ లాల్ ఖత్తర్ గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లనుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాలకు గాను పది గెలిచి బీజేపీ మంచి ఊపుమీద ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనన్న ధీమాలో బీజేపీ నేతలున్నారు.ఇటీవల పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలపై సమీక్ష నిర్వహించారుస్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు.

 

 

 

 

పక్కనే ఉన్న హిమాచలప్రదేశ్ కు చెందిన నడ్డాకు హర్యానా రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. గత ఎన్నికల్లో 18 స్థానాలు, 24.1 ఓట్ల శాతం సాధించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. కీలకమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన పార్టీ సారథి అభయ్ సింగ్ చౌతాలాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టుంది. పార్టీ ప్రధాన మద్దతుదారుల్లో జాట్ లు ఒకరు. 2014 ఎన్నికల వరకూ భూపేందర్ సింగ్ హుడా సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. నాటి ఎన్నికల్లో హుడా సారథ్యంలోనే పోరాడిన కాంగ్రెస్ 17 స్థానాలు, 20.6 శాతం ఓట్లతో మూడోస్థానానికే పరిమితమైంది. మళ్లీ ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలు ఎదుర్కొననుంది.

 

 

 

 

జార్ఖండ్ ఎన్నికలపైనా ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. గత ఐదేళ్లుగా రఘుబరన్ దాస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 81 స్థానాలు గల అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంతో కలసి 46 స్థానాలను సాధించింది. ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా 19 స్థానాలను సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ పార్టీ సారధి మేమంత్ సొరేన్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్ 8 స్థానాలతో మూడో స్థానానికే పరిమితమయింది. జేవీపీ, సీపీఐ(ఎంఎల్), బీఎస్పీ వంటి చిన్నా చితకా పార్టీలు ఒకటి, రెండు స్థానాలతోనే సరిపెట్టుకున్నాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను బీజపీ 12 స్థానాలను గెలుచుకుంది.

 

 

 

కాంగ్రెస్, జేఎంఎం చెరి ఒకటిని దక్కించుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భఆర్యత గీతా కోడా సింగ్ భూమ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలమన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. పీసీసీ చీఫ్ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు.

 

 

 

 

 

వీరు కేంద్ర మాజీ మంత్రి సభోర్ కాంత్ సహాయ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రదీప్ బల్మూబ్, ధన్ బాద్ మాజీ ఎంపీ చంద్రశేఖర్ ప్రముఖులు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులు కెసి వేణుగోపాల్ , అహ్మద్ పటేల్ అంతర్గత కలహాలను కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ వికాస్ మోర్చాతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ తలపోస్తుంది. మొత్తానికి కమలదళం ఎన్నికలను ఎదుర్కొనేందుకు మంచి ఉత్సాహంతో ఉండగా, విపక్షాలు ఇప్పుడిప్పుడే శక్తిని కూడ దీసుకుంటున్నాయి.

 

టీడీపీలో తీవ్రస్థాయికి వారసుల రచ్చలు

Tags: Whose calculations are on Jharkhand and Haryana

కోమటికి కమలం నుంచి రాని పిలుపు

Date:12/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలోని ఇతర పార్టీల నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకుంటున్న బీజేపీ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే అనేక మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్టు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు.

 

 

 

 

 

అతి త్వరలోనే బీజేపీలో చేరతానని…ఆ పార్టీ ముఖ్యనేతలతో ఈ మేరకు చర్చలు కూడా జరిపానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆయన బీజేపీలో చేరలేదు. దీంతో అసలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఎంట్రీ ఎందుకు ఆలస్యమవుతుందోనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ ద్వితీయ శ్రేణి నాయకుడితో రాజగోపాల్ రెడ్డి ఫోన్ సంభాషణ బయటకు రావడం… బీజేపీలో చేరితే తానే సీఎం అవుతానని అందులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.

 

 

 

 

 

దీంతో ఆయనను పార్టీలోకి తీసుకునే విషయంలో అధిష్టానానికి స్థానిక నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయనను పార్టీలో చేర్చుకునే అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తాత్కాలికంగా పక్కనపెట్టిందనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కోమటిరెడ్డి అనుచరులు మాత్రం ప్రస్తుతం మంచి రోజులు లేని కారణంగానే బీజేపీలో ఆయన చేరిక ఆలస్యమవుతోందని అంటున్నట్టు తెలుస్తోంది.

 

 

 

 

 

అయితే బీజేపీ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగే అవకాశాలు కూడా పెద్దగా కనిపించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బీజేపీలో చేరతానని బహిరంగంగా ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… కాషాయ కండువా కప్పుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

జూలై 30 వరకు బీఆర్ ఎస్ పోడిగింపు

 

Tags: The call from the lotus to comedy

గొడ్డేటి మాధవికి బంపర్ ఆఫరేనా

Date:12/06/2019

విజయవాడ ముచ్చట్లు:

భారీ మెజార్టీతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఏపీలో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని

వైఎస్ఆర్సీపీకి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ విషయాన్ని జగన్‌కు తెలియజేశారని, అందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, డిప్యూటీ స్పీకర్ పదవిని

గిరిజన ఎంపీకి ఇచ్చే దిశగా జగన్ యోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తలు నిజమైతే.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని ఈ పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. 17వ లోక్ సభలో పిన్న

వయస్కురాలైన ఎంపీ మాధవి అనే సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలుపొందిన బీజేపీ సొంత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కమలనాథులకు లోక్ సభలో వేరే పార్టీ

అవసరం లేదు. కానీ రాజ్యసభలో మాత్రం బీజేపీ బలం తక్కువగా ఉంది. దీంతో కీలక బిల్లులను పాస్ చేసే విషయంలో మోదీ సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది వరకూ ఇదే పరిస్థతి

ఉండనుంది. దీంతో ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదీగాకుండా.. మంత్రి పదవుల విషయంలో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని జేడీయూ అలకబూనింది. బిహార్ బయట

బీజేపీతో పొత్తులుండవని చెబుతోంది. దీంతో జేడీయూ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ నాయకత్వం వైఎస్ఆర్సీపీ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పార్టీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్

పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం.కేంద్రంలో బీజేపీతో ప్రస్తుతానికి స్నేహంగానే ఉండాలని డిసైడయిన వైసీపీ… ఆ పార్టీకి మరింతగా దగ్గరయ్యే అవకాశం లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎన్డీయే నుంచి జేడీయూ దూరం జరగనుందనే ప్రచారం జరుగుతోంది. బీహార్‌లో జేడీయూ తమకు దూరమైతే… ఆ స్థానాన్ని

వైసీపీతో భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా వైసీపీకి లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసేందుకు బీజేపీ

ముందుకొచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్‌సభలో ఈ పదవిని అన్నాడిఎంకెకు

కేటాయించింది బీజేపీ. అన్నాడీఎంకెకు చెందిన తంబిదురై లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. అయితే తాజాగా ఏపీలోని వైసీపీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయాలని బీజేపీ

నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ ఈ పదవిని స్వీకరిస్తారా… తీసుకుంటే ఇందుకు ఎవరి

పేరును ఖరారు చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

 

శ్రీలంకను కాపాడేస్తున్న మిస్టర్ వరుణ్

 

Tags:The bumper offer

2021 టార్గెట్ బెంగాల్

Date:11/06/2019

కోల్ కత్తా  ముచ్చట్లు:

అందరి అంచనాలను తారుమారు చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో 18 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు

బెంగాల్ రాజకీయాలను ఒక కుదుపు కుదపడమే కాదు, బలమైన శక్తిగా బీజేపీ అవతరించడం అధికార టీఎంసీ, ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎంలకు ఊహించని ఎదురుదెబ్బగా పరిణమించింది. 42 ఎంపీ

స్థానాల్లో 18 స్థానాల్లో విజయదుందుభి మోగించి యావత్ దేశాన్ని బీజేపీ ఆశ్చర్యపరిచింది. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు కొట్టిన కమలం అసెంబ్లీలోనూ పాగా వేసేందుకు ఇప్పటినుంచే

పావులు కదుపుతోంది. 294 సభ్యులు కలిగిన శాసనసభలో 250 స్థానాలను కైవసం చేసుకునేందుకు లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు

జరగనున్నాయి. ఎన్నికల నాటికి పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై బీజేపీ కేంద్ర అధినాయకత్వం ఇప్పటినుంచే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. కిందిస్థాయి నుంచి బీజేపీని బలోపేతం

చేయడంతో పాటు తృణమూల్ నాయకుల చేరికలపై ఆచితూచి అడుగులు వేస్తోంది. బెంగాలీల ఆత్మగౌరవం నినాదంతో పటిష్ఠంగా ఉన్న తృణమూల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది.

పారిశ్రామికీకరణతో ఉద్యోగాల కల్పన, పౌరసత్వ బిల్లు, జాతీయ పౌర రిజిస్టర్ అమలు చేస్తామన్న స్పష్టమైన హామీలతో బీజేపీ ముందుకు కదులుతోంది. అయితే బీజేపీ ఇస్తున్న హామీలను అంతగా

పట్టించుకోని తృణమూల్ 2021లో మళ్లీ అధికారం మాదేనన్న ధీమాతో ఉంది. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలన్న బీజేపీ కల కలగానే మిగిలిపోతుందని భావనలో ఉంది. అయితే సార్వత్రిక

ఎన్నికల్లో 40.5 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి బెంగాల్ అసెంబ్లీలో ఆరుగురు సభ్యుల ప్రాతినిధ్యం ఉంది. ‘లోక్‌సభ ఎన్నికల్లో 23 స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్నా 18 స్థానాల్లో విజయం

సాధించాం. ప్రస్తుతం అసెంబ్లీలో 250 సీట్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఈ లక్ష్య సాధన దిశగా వ్యూహరచన చేస్తున్నాం’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, బెంగాల్ ఇన్‌చార్జి కైలాష్ విజయ్

వర్గీయ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కేంద్ర అధినాయకత్వంతో రాష్ట్ర బీజేపీ శాఖ సంప్రదింపులు ప్రారంభించింది. టీఎంసీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలను పార్టీలో

చేర్చుకునే అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిన బీజేపీ అన్నీ ఆలోచించిన తర్వాతే పార్టీలో వారికి ఆహ్వానం పలకాలని నిర్ణయించుకుంది. ప్రజల్లో మంచి పేరు కలిగిన నాయకులను మాత్రమే పార్టీలో

చేర్చుకోవాలని నిర్ణయించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. టీఎంసీ ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లాం చేరికపై వివాదం చెలరేగడం, జనంలోకి

తప్పుడు సంకేతాలు వెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ముస్లిం నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో రాష్ట్ర బీజేపీ శాఖలో భిన్నాభిప్రాయాలు

వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా పార్టీ రూపురేఖలు మార్చే దిశగా బీజేపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అసెంబ్లీ సెగ్మెంట్లను నాలుగు విభాగాలుగా

విభజించింది.లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గట్టి పోటీ ఇచ్చిన నియోజకవర్గాల వారీగా విభజించి ఆ మేరకు పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. గ్రామాలకు సైతం పార్టీ కర్యకలాపాలు

విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

పీఎం ముందుకు ఏపీ చిట్టా విప్పిన జగన్

Tags:2021 Target Bengal

బీజేపీ నెక్స్ట్ర్ ఏంటీ 

Date:25/05/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేంద్రంలో బ్రహ్మాండమైన మెజారిటీ సాధించిన కమల నాథుల తదుపరి లక్ష్యం ఏంటి? బొటా బొటీ మెజారిటీతో కుప్ప కూలడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడమేనా? బెంగాల్ లో మమత కోటకు బీటలు పెట్టిన బీజేపీ తన దృష్టిని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైకి మళ్లించిందా? ఎన్డీఏ కూటమి కేంద్రంలో తిరుగులేని ఆవిర్భావ శక్తిగా ఎదిగిన బీజేపీ ఇప్పుడు గెలుపు ఉత్సాహంలో ఉంది.. ఈ గెలుపును మలుపుగా చేసుకుని రాష్ట్రాలలో పార్టీ విస్తరణకు బీజేపీ దూకుడు ప్రయత్నాలు మొదలు పెట్టేస్తోందా? రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న సంకీర్ణ సర్కార్ లను పార్టీలను ఓ పట్టు పడతారా అంటే అవుననే అనుమానాలే ఎక్కువవుతున్నాయి. కాంగ్రెస్ బొటా బొటీ మెజారిటీతో కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ తనదైన శైలిలో చక్రం తిప్పుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే అధికారం దక్కించుకోడానికి అనువుగా ఎత్తుగడలు వేస్తోంది. కాంగ్రస్, జేడీఎస్ మధ్య సంబంధాలు దెబ్బతినడం, కాంగ్రెస్ నేత డీ.కే. శివకుమార్ బీజేపీతో టచ్ లో ఉండటం వల్ల ఏ క్షణాన్నైనా కర్ణాటక సర్కార్ లో ముసలం పుట్టొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

 

 

 

 

 

ఇక మధ్య ప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందని బీజేపీ గెలిచిన మరుక్షణమే సంకేతాలు వెలువడ్డాయి. కమల్ నాథ్ సర్కార్ మైనారిటీలో ఉందని పదవినుంచి తప్పుకోవాలంటూ బీజేపీ గవర్నర్ దగ్గర పంచాయతీకి తెర లేపింది.ఉత్తరాదిన మంచి పట్టు సంపాదించిన బీజేపీ ఇప్పుడు తన చూపు దక్షిణాదివైపుకు మరలుస్తోంది. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతామని, తెలంగాణలో ప్రజాస్వామ్య పోరాటాలు చేసి నిలదొక్కుకుంటామనీ, భవిష్యత్తులో అధికారంలోకి వస్తామనీ బీజేపీ పెద్దలు చెబుతున్నారు. దీనిని బట్టి కమల నాథులు తెలుగు రాష్ట్రాలపై కన్నేసినట్లు కనిపిస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీజేపీ మళ్లీ ఏపీ వైపు చూస్తోంది. జగన్ తో సత్సంబంధాలు నెరపుకుంటూ పార్టీ పటిష్టతకు బీజం వేసుకునే ఉద్దేశంతో ఉంది. ఇక బెంగాల్ లో ఊహించని విధంగా బీజేపీ పుంజుకుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

రెండు సీట్ల నుంచి ఏకంగా 18 ఎంపీ సీట్లకు ఎగబాకడం నిజంగా చరిత్రాత్మకం మమతా బెనర్జీ పట్టు నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి బీజేపీ అక్కడ పునాదులు నిర్మించుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో మోడీ 42 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ చేసిన బెదిరింపు వెనక పైకి కనపడని ప్రయత్నాలేవో జరుగుతున్నాయని తెలుస్తోంది.ఎన్నికల ఫలితాలు రాగానే ఇద్దరు తృణమూల్ ఎంపీలు కూడా బీజేపీ నేతలతో టచ్ లోకి రావడంతో బెంగాల్ లో బీజేపీ కుదురుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసినట్లే అర్ధమవుతోంది.

 

 

ప్రక్షాళనలు వుంటాయి

Tags: BJP Chief Executive Officer

ఈవీఎంలు..నిజంగానే ట్యాంపరింగా

Date:27/04/2019
తిరువనంతపురం ముచ్చట్లు:
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మ‌రోమారు అధికారంలోకి వ‌స్తే… అది ఆ పార్టీకి జ‌నాల్లో ఉన్న ప్ర‌జాద‌ర‌ణ అని ఎంత‌మాత్రం చెప్ప‌లేం. ఎలాగూ జ‌నాల్లో మోదీ మేనియా త‌గ్గింద‌న్న విష‌యాన్ని ఎన్నిక‌ల‌కు ముందుగానే గుర్తించేసిన క‌మ‌ల‌నాథులు… ఎలాగైనా మ‌రోమారు అధికారంలోకి రావాల్సిందేన‌న్న భావ‌న‌తో… జ‌నం ఓట్లేయ‌కున్నా… ఎలా గెల‌వాలో ప‌క్కాగానే ప్లాన్ గీసుకున్నారు. అందుకు వారు ఈవీఎంలే కేంద్రంగా పెద్ద కుట్ర‌కే తెర తీశారు. ఇప్ప‌టికే ఈవీఎంల‌పై టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల‌కు చెందిన ప్రాంతీయ పార్టీల‌తో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ తదిత‌ర పార్టీల‌న్నీ కూడా ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈవీఎంల‌ను ట్యాంపరింగ్ చేయ‌డం ద్వారా బీజేపీ గెల‌వాల‌ని అనుకుంటోంద‌ని, ఈ క్ర‌మంలోనే కౌంటింగ్ లో ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్ల లెక్కింపుతో పాటు వాటిలోని వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను కూడా కౌంట్ చేయాల్సిందేన‌ని చంద్ర‌బాబు స‌హా 21 పార్టీల అధినేత‌లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొట్టిపారేయ‌డంతో వారంతా చంద్ర‌బాబు ఆధ్వర్యంలోనూ సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కారు. ఇప్ప‌టికే మూడు ద‌శ‌ల పోలింగ్ ముగియ‌డం, ఇంకో నాలుగు విడ‌త‌ల పోలింగ్ మిగిలి ఉండ‌టం, కౌంటింగ్ వ‌చ్చే నెల 23న జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు త‌మ‌కు అనుకూలంగా తీర్పు వెలువ‌రిస్తుంద‌ని చంద్ర‌బాబు అండ్ కో చాలా గ‌ట్టి న‌మ్మ‌కంతోనే ఉన్నారు.అయినా చంద్ర‌బాబు స‌హా ఇత‌ర పార్టీల నేత‌లంతా ఈవీఎంల‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు అక్ష‌రాల నిజ‌మ‌న్న ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా చోటుచేసుకుంటున్నాయి. ఇందులో గోవాలో జ‌రిగిన ఘ‌ట‌న బీజేపీ కుట్ర‌ను క‌ళ్ల‌కు క‌ట్టేసింద‌నే చెప్పాలి. మొన్న మూడో విడ‌త‌లో అక్క‌డ పోలింగ్ జ‌ర‌గ‌గా… పోలింగ్ ప్రారంభానికి ముందుగా మాక్ పోలింగ్ నిర్వ‌హించారు. ఓ స్థానంలో మొత్తం ఆరు మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉంటే… మాక్ పోలింగ్ లో భాగంగా ఒక్కో అభ్య‌ర్థికి 9 ఓట్ల చొప్పున వేయించిన అధికారులు… వాటిని జ‌నం ముందే కౌంట్ చేశారు. ఈ లెక్క‌న ఆరుగురు అభ్య‌ర్థుల‌కు 9 ఓట్లేసి రావాలి.
అయితే అనూహ్యంగా బీజేపీ అభ్య‌ర్థికి ఏకంగా 17 ఓట్లు వ‌చ్చేశాయి. కాంగ్రెస్ కు 9 ఓట్లు రాగా… ఆప్ అభ్య‌ర్థికి 8 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్య‌ర్థికి కేవ‌లం ఒక్క ఓటే వ‌చ్చింది. ఈ లెక్క‌న 9 ఓట్లు మాత్ర‌మే వేస్తే… బీజేపీకి 17 ఓట్లు ఎలా వ‌చ్చాయ‌న్న‌ది అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌.అంతేకాకుండా ఆప్ అభ్య‌ర్థికి 9 ఓట్లు వ‌స్తే… 8 ఓట్లే ఎలా కౌంట్ అయ్యాయి? స‌్వ‌తంత్ర అభ్య‌ర్థికి కూడా 9 ఓట్లు వేస్తే… ఏకంగా ఒక్క ఓటు మాత్ర‌మే ఎలా కౌంట్ అయ్యింది. అంటే… ఇత‌ర పార్టీల అభ్య‌ర్థుల‌కు వేస్తున్న ఓట్ల‌లో చాలా భాగం బీజేపీకి ప‌డిపోతున్నాయ‌న్న మాట‌.. మ‌రి 9 ఓట్ల‌కే ఏకంగా 17 ఓట్లు వ‌స్తే… ఇక వేలు, ల‌క్ష‌ల ఓట్ల‌లో బీజేపీ ఎంత‌మేర ఓట్ల‌ను దొంగిలిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదన్న మాట వినిపిస్తోంది. కేర‌ళ‌లోనూ ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. జ‌నం ప్ర‌శ్నించిన చోట మాత్ర‌మే ఈవీఎంల‌ను మార్చేస్తున్న అధికారులు… చాలా ప్రాంతాల్లో గుట్టు చ‌ప్పుడు కాకుండానే ఈ తతంగాన్ని న‌డిపించేస్తున్నారు. ఈ లెక్క‌న మ‌రోమారు గెలుపొందేందుకు జ‌నామోదాన్ని కాకుండా ఈవీఎంల‌ను న‌మ్ముకుని బీజేపీ వ్యూహం ర‌చించుకుంద‌న్న మాట‌. మ‌రి ఈ కుట్ర‌ల‌కు సుప్రీంకోర్టు ఎలాంటి బ్రేకులేస్తుందో చూడాలి.
Tags: EVMs

రాజ్ నాధ్ మీటింగ్ కు జనాలు కరువు

Date:03/04/2019

విజయవాడ ముచ్చట్లు :
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో కాలుమోపారు. అయితే, బీజేపీ అధినాయకత్వంలో నంబర్.3 గా వెలుగొందుతున్న రాజ్ నాథ్ కు అవనిగడ్డలో నిరాశ తప్పలేదు. ఆయన సభ జనంలేక వెలవెల పోయింది. టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో బీజేపీ అగ్రనేత చెప్పే మాటలు వినడానికి ఎవరూ ఆసక్తిచూపించలేదు. అయితే, తన సభలో ఆద్యంతం టీడీపీపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు రాజ్ నాథ్ సింగ్. ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజల కళ్లల్లో మట్టికొట్టిందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఆయన తెలంగాణలోని నిజామాబాద్ సభలో పాల్గొన్నారు.
Tags:Diseases of the Raj Nadh Meeting