బీజేపీలో జితేందర్ రెడ్డి చేరిక దేనికి సంకేతం ? 

  Date:28/03/2019

హైద‌రాబాద్ ముచ్చట్లు:
జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో రెండు కులాల పార్టీగా మిగిలి పోయేందుకు శరవేగంగా దూసుకుపోతున్నది.  తెలంగాణ బీజేపీలో ఇప్పటికే సుమారు ఇరవై ప్రాధాన్యత కలిగిన పదవులతో వెలమ కుల ఆధిపత్యం కొనసాగుతుండగా, గతంలో ఈ పార్టీ రెడ్డి కుల వాళ్ళతో నిండిపోయి ఇతర కులాల వారిని అణిచివేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం, టీఆరెస్స్ లో, రెడ్డి కుల రాజకీయాలు చేస్తూ, పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి, క్రమశిక్షణా రాహిత్యమైనవ్యక్తి,  మహబూబ్ నగర్ లోకసభ టికెట్ హామీ దక్కక కాంగ్రెస్ లో చేరలేక, గత్యంతరంలేక టీఆర్ఎస్. లోనే ఉండిపోయిన జితేందర్ రెడ్డి చేరికకు రాంమాధవ్ మంతనాలు చేయడం హాస్యాస్పదం. ఇంటినిండా, వంటినిండా రెడ్డి కుల పిచ్చి నింపుకున్న జితేందర్ రెడ్డి లాంటి వారిని చేర్చుకోవడం వల్ల బీజేపీకి అదనంగా ఒరిగేదేమీ లేదు. పైగా తనకు రాజ్యసభ టికెట్, లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టు,  తన కొడుకులకు రాజకీయ భవిష్యత్తు కు హామీ తీసుకుని పార్టీలో చేర్చుకోవాల్సిన ఖర్మ బీజేపీకి పట్టింది. గతంలో పదవులు అనుభవించి బయటకు పోయి, తిరిగి ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని బీజేపీలో చేరాడు. తప్పితే బీజేపీ ఓడిపోతుందంటే ఆవైపు కన్నెత్తి చూసే రకం కాదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలు ఓట్లు వేయాలి. పదవులు మాత్రం వెలమ, రెడ్డి కులాలకు కట్టబెట్టే బీజేపీ లాజిక్కేంటో ఆ పార్టీ నాయకులే చెప్పాలి. రెడ్ల పార్టీగా ఉన్న కాంగ్రెస్, వెలమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కు బీ టీమ్ పార్టీగా తెలంగాణ బీజేపీ తయారైంది. ఇటువంటి పార్టీకి మిగతా కులాల ఓటర్లు ఓట్లెందుకు వెయ్యాలో ఆ పార్టీయే చెప్పాలి. రెడ్ల పార్టీగా ఉన్నందుకు కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తూ, ప్రత్యామ్నాయం లేక టీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ బీ టీం అయినందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 5 నుంచి ఒకటికి కుదించుకుపోయింది. ఈ రెడ్డి కుల పిచ్చిగాళ్ళ వల్ల పార్టీకి లాభమా ? పార్టీ వల్ల ఈ కుల పిచ్చిగల వారికి లాభమా ? అనే విషయాన్ని బేరీజు వేసుకుంటేనే, నరేంద్ర మోదీ గారికి అనుకూలంగా ఉన్న తెలంగాణ ఓటర్లు, తమ ఓట్లను బీజేపీవైపునకు మళ్ళిస్తారు. లేని పక్షంలో బిజెపి పని అంతే!
Tags:What is the sign of Jitender Reddy in the BJP?

ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ

  Date:28/03/2019

  హైదరాబాదు ముచ్చట్లు:
ఈ సారి దక్షిణాది నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం… ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తెలంగాణలోనూ ఎన్నో కొన్ని సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు కొద్ది వారాల ముందు కీలకమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం దృష్టి పెట్టింది. ఇందులో కొంతమేర విజయం సాధించింది కూడా. అయితే తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఐదు సీట్లే అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సీట్లలో పాగా వేయగలిగితే… తాము అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఎక్కువగా గురి పెట్టిన స్థానాల జాబితాలో సికింద్రాబాద్, చేవేళ్ల, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ ఉన్నట్టు తెలుస్తోంది. తమ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ నుంచి ఈ సారి బండారు దత్తాత్రేయకు బదులుగా మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని రంగంలోకి దించుతోంది బీజేపీ. మరోసారి ఈ స్థానాన్ని కైవవం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
చేవేళ్ల నుంచి బండారు దత్తాత్రేయ వియ్యంకుడు జనార్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన చాలాకాలంగా ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మోదీ మేనియా కలిసొచ్చి, మరింత కష్టపడితే ఈ సీటు తమ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఇక మహబూబ్ నగర్ స్థానంపై ఈ సారి బీజేపీ ఎక్కువగా దృష్టి పెట్టింది. జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీమంత్రి డీకే అరుణ ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి పాలమూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి కూడా బీజేపీ గూటికి చేరారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి కలిసి ఈ సీటును బీజేపీ ఖాతాలో పడేలా చేస్తారని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇక గతంలో బీజేపీ గెలిచిన కరీంనగర్ స్థానం నుంచి ఈ సారి బండి సంజయ్ బరిలో ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో సానుభూతి ఎక్కువగా ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ బలంగా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్ తనయుడు అరవింద్ బరిలో ఉన్న నిజామాబాద్ స్థానంపై కూడా బీజేపీకి ఆశలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చాలాకాలం నుంచి పని చేసుకుంటున్న అరవింద్… ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు కాలం కలిసొస్తే అదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న సోయం బాపురావు కూడా గెలిచే అవకాశం ఉందని బీజేపీ ఆశిస్తోంది. మొత్తానికి తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకుంటుందా లేదా అన్నది చూడాలి.
Tags:The BJP, which wants to win as many seats as possible

పోటీకి స్వేచ్ఛ ఇచ్చేసిన బీజేపీ

Date:25/01/2019
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
బీజేపీ అగ్ర నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు సంబంధించి ఆ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణయాన్ని వారికే వదిలేసింది. మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? లేదా? అనే నిర్ణయాన్ని మీరే తీసుకోవాలంటూ వారికి సూచించింది.75 ఏళ్ల వయసు పైబడిన నేతలను బీజేపీ ప్రస్తుత నాయకత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం వయోపరిమితి విధించలేదు. అద్వానీ ప్రస్తుత వయసు 91 కాగా… జోషి వయసు 84 ఏళ్లు. మరోవైపు అనారోగ్య కారణాలతో సుష్మాస్వరాజ్, ఉమా భారతిలు కూడా ఎన్నికలకు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జోషికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మాట్లాడుతూ, పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు జోషి నడుచుకుంటారని చెప్పారు.
Tags:The BJP, which gave freedom to the contest

రాజ్యసభలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్న బిజెపి 

Date:24/03/2018
న్యూదిల్లీ ముచ్చట్లు:
శుక్రవారం వెలువడిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు బిక్జేపి పార్టీకి ఊరట కలిగించాయి. అత్యధిక స్థానాలను గెలుచుకొని, రాజ్యసభలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 245 మంది సభ్యులున్న పెద్దల సభలో పూర్తి స్థాయి ఆధిక్యం రానప్పటికీ విపక్ష కాంగ్రెస్‌ కన్నా సంఖ్యాబలంలో మాత్రం మెరుగైన స్థితికి వచ్చింది. తాజా ఫలితాలతో భాజపా ఖాతాలో మరో 11 స్థానాలు అదనంగా వచ్చి చేరాయి.245 మంది సభ్యులున్న రాజ్యసభలో భాజపా బలం 58 నుంచి 69కి చేరింది. ఇక అదే సమయంలో కాంగ్రెస్‌ నాలుగు స్థానాలను కోల్పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ సంఖ్యా బలం 54 నుంచి 50కి పడిపోయింది. ఇటీవల జరుగుతోన్న రాజకీయ పరిణామాలు భాజపాకు ఊహించని షాక్‌లను ఇచ్చాయి. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది. దీనికి తోడు భాజపాకు కంచుకోటలాంటి యూపీలోని గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌ లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. ఆ రెండు స్థానాలను సమాజ్‌ వాదీ పార్టీ సొంతం చేసుకుంది. అంతకముందు 16మంది భాజపా తరపు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ నిన్న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందినా, రాజ్యసభలో మాత్రం సరైన సంఖ్యా బలం లేక ఆగిపోయేవి. కొన్నిసార్లు విపక్షాలను సైతం బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాల్సి వచ్చేసింది. తాజా ఫలితాలతో రాజ్యసభలోనూ భాజపా బలం పెరగడం ఆ పార్టీకి ఊరట కలిగించే అంశం. ఐతే ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో భాజపాకు ఊహించని దెబ్బ తగిలింది.
Tags:The BJP, which has strengthened its position in the Rajya Sabha