జార్ఖండ్, హర్యానాలపై ఎవరి లెక్కలు వారివే

-త్రిముఖ పోటీలో విజేతలు ఎవరు

Date:13/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో జరగనున్న హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, జేయూఎం పార్టీలు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. హర్యానాలో కాంగ్రెస్, జార్ఖండ్ లో ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నాయి. అధికారాన్ని రెండు రాష్ట్రాల్లో కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, జేఎంఎ: శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి.

 

 

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికారాన్ని సాధించడం పక్కన పెడితే గౌరవ ప్రదమైన స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, జేఎంఎం పనిచేస్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉండే హర్యానాపై అందరి దృష్టి ఉంది. హర్యానా పేరు చెప్పగానే దేవీలాల్, భజన్ లాల్, బన్సీలాల్ గుర్తుకు వస్తారు. ఈ లాల్ త్రయం రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు శాసించింది. దేవీలాల్ జనతాదళ్ హయాంలో ఉప ప్రధానిగా, బన్సీలాల్ 70ల్లో కాంగ్రెస్ హయాంలో రక్షణమంత్రిగా చక్రం తిప్పారు. భజన్ లాల్ కేంద్రంలో పనిచేయనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సత్తా చాటారు.

 

 

 

 

దేవీలాల్, బన్సీలాల్ కూడా సీఎంగా చక్రం తిప్పారు. ప్రస్తుతం భజన్ లాల్ , బన్సీలాల్ వారసులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాల్లో లేరు. దేవీలాల్ వారసులు మాత్రం క్రియాశీలకంగా ఉన్నారు. దేవీలాల్ వారసులు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పేరుతో పార్టీని నడిపిస్తున్నారు. ఆయన తనయుడు ఓంప్రకాశ్ చౌతాలా 1999 నుంచి 2005 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఇరుక్కుని ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. చౌతాలా తనయుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు.

 

 

 

2014 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాలు, 33.2 శాతం ఓట్లు సాధించి అధికారాన్ని అందుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేసిన మనోహర్ లాల్ ఖత్తర్ గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లనుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాలకు గాను పది గెలిచి బీజేపీ మంచి ఊపుమీద ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనన్న ధీమాలో బీజేపీ నేతలున్నారు.ఇటీవల పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలపై సమీక్ష నిర్వహించారుస్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు.

 

 

 

 

పక్కనే ఉన్న హిమాచలప్రదేశ్ కు చెందిన నడ్డాకు హర్యానా రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. గత ఎన్నికల్లో 18 స్థానాలు, 24.1 ఓట్ల శాతం సాధించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. కీలకమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన పార్టీ సారథి అభయ్ సింగ్ చౌతాలాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టుంది. పార్టీ ప్రధాన మద్దతుదారుల్లో జాట్ లు ఒకరు. 2014 ఎన్నికల వరకూ భూపేందర్ సింగ్ హుడా సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. నాటి ఎన్నికల్లో హుడా సారథ్యంలోనే పోరాడిన కాంగ్రెస్ 17 స్థానాలు, 20.6 శాతం ఓట్లతో మూడోస్థానానికే పరిమితమైంది. మళ్లీ ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలు ఎదుర్కొననుంది.

 

 

 

 

జార్ఖండ్ ఎన్నికలపైనా ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. గత ఐదేళ్లుగా రఘుబరన్ దాస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 81 స్థానాలు గల అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంతో కలసి 46 స్థానాలను సాధించింది. ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా 19 స్థానాలను సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ పార్టీ సారధి మేమంత్ సొరేన్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్ 8 స్థానాలతో మూడో స్థానానికే పరిమితమయింది. జేవీపీ, సీపీఐ(ఎంఎల్), బీఎస్పీ వంటి చిన్నా చితకా పార్టీలు ఒకటి, రెండు స్థానాలతోనే సరిపెట్టుకున్నాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను బీజపీ 12 స్థానాలను గెలుచుకుంది.

 

 

 

కాంగ్రెస్, జేఎంఎం చెరి ఒకటిని దక్కించుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భఆర్యత గీతా కోడా సింగ్ భూమ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలమన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. పీసీసీ చీఫ్ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు.

 

 

 

 

 

వీరు కేంద్ర మాజీ మంత్రి సభోర్ కాంత్ సహాయ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రదీప్ బల్మూబ్, ధన్ బాద్ మాజీ ఎంపీ చంద్రశేఖర్ ప్రముఖులు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులు కెసి వేణుగోపాల్ , అహ్మద్ పటేల్ అంతర్గత కలహాలను కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ వికాస్ మోర్చాతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ తలపోస్తుంది. మొత్తానికి కమలదళం ఎన్నికలను ఎదుర్కొనేందుకు మంచి ఉత్సాహంతో ఉండగా, విపక్షాలు ఇప్పుడిప్పుడే శక్తిని కూడ దీసుకుంటున్నాయి.

 

టీడీపీలో తీవ్రస్థాయికి వారసుల రచ్చలు

Tags: Whose calculations are on Jharkhand and Haryana

కర్నూలులో ఆసక్తికర రాజకీయం

Date:01/05/2019
కర్నూలు ముచ్చట్లు:
ఏపీలో తాజా ఎన్నిక‌ల్లో నువ్వా-నేనా అనే రీతిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పోరు సాగించిన విష‌యం తెలిసిందే. ఇక‌, క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు ఎంపీ స్థానం నుంచి ఈ ద‌ఫా ఓ సంచ‌ల‌న‌మే చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు కూడా కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి కూడా అనూహ్యంగా టీడీపీలోకి జంప్ చేశారు. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న వైరాన్ని కూడా మ‌రిచిపోయి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. క‌ర్నూలు జిల్లాలో కోట్ల వ‌ర్సెస్ కేఈ ఫ్యామిలీ మ‌ధ్య తీవ్ర‌మైన వైరుధ్యం ఉంది. ఏకంగా మూడు ద‌శాబ్దాల పాటు ఈ రెండు ఫ్యామిలీలు రాజకీయంగా తీవ్ర‌మైన బ‌ద్ధ శ‌త్రువులుగా కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. అలాంటి వీరిద్ద‌రిని చంద్ర‌బాబు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసి ఎట్ట‌కేల‌కు ఒకే వేదిక మీద‌కు తీసుకువ‌చ్చారు. క‌ర్నూలు ఎంపీ టికెట్‌ను చంద్ర‌బాబు కోట్ల‌కు కేటాయించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. ఇక్క‌డ నుంచి వైసీపీ నాయ‌కురాలు.. బుట్టా రేణుక విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు అన్ని స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన బుట్టాకు చంద్ర‌బాబు టికెట్ నిరాక‌రించ‌డంతో ఆమె తిరిగి వైసీపీలోకి చేరిపోయారు. చాప‌కింద నీరులాగా ఆమె వైసీపీకి విజయం చేకూర్చేలా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్‌పై కోట్ల పోటీ చేశారు.
వైసీపీ త‌ర‌ఫున డాక్ట‌ర్ సంజీవ కుమార్ పోటీ చేశారు. ఇక్క‌డ నుంచి జ‌న‌సేన అభ్య‌ర్థిగా ఎవ‌రూ పోటీ చేయ‌క‌పోవ‌డం విశేషం. ఇక‌, కోట్ల ఊరూ వాడా చుట్టి వ‌చ్చారు. ముఖ్యంగా మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కూడా పాత వివాదాల‌ను ప‌క్క‌న‌పెట్టికోట్ల ప్ర‌చారంలో పాల్గొన‌డం క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు.టీడీపీలో టికెట్ ఆశించి భంగ‌ప‌డిన ఎస్వీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక‌లు యూట‌ర్న్ తీసుకుని వైసీపీకి అనుకూలం గా చేసిన ప్ర‌చారాన్నికూడా కొట్టి పారేయ‌లేమ‌ని అంటున్నారు. వాస్త‌వంగా వీరిద్ద‌రికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో సొంత ఓటు బ్యాంకు అంటూ లేక‌పోయినా బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హిళగా త‌న‌కు అన్యాయం జ‌రిగింది అంటూ బుట్టా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్ర‌యోగించారు. ఈ ఇద్ద‌రుకూడా పోటీలో ఉన్న అభ్య‌ర్థికంటే కూడా ఉత్సాహంగా వైసీపీకి ప్ర‌చారం చేశారు. తాము టీడీపీలోకి వ‌చ్చి త‌ప్పు చేశామ‌ని, వైసీపీకి ఓటేసి గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. మొత్తంగా వైసీపీ చేసిన ప్ర‌చారం గ‌ట్టిగానే సాగిన నేప‌థ్యంలో కోట్ల గెలుపు సాధ్య‌మేనా అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.
ఇక కోట్ల‌కు సీమ‌లో…ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలో వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకు ఉంద‌న్న‌ది నిజం. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయినా క‌ర్నూలు ఎంపీగా పోటీ చేసిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డికి ఏకంగా 1.20 ల‌క్ష‌ల‌ ఓట్లు వ‌చ్చాయి. ఇక ఆలూరులో పోటీ చేసిన ఆయ‌న భార్య కోట్ల సుజాత‌మ్మ కూడా 25 వేల ఓట్లు తెచ్చుకున్నారు. వీరిద్ద‌రు ఏపీలో మిగిలిన కాంగ్రెస్ నేత‌ల వ‌లే డిపాజిట్లు కోల్పోకుండా నిల‌బ‌డ్డారు. ఇది వీరి వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంక్ అని చెప్ప‌డంలో సందేహాలు అక్క‌ర్లేదు. అయితే, కాంగ్రెస్‌లో ఉన్న‌స‌మ‌యంలో ఉన్న హ‌వా ఇప్పుడు ఆయ‌న‌కు పెరిగిందా? లేదా? ఇక ఇటు వైసీపీ అధినేత జ‌గ‌న్ బీసీ అస్త్రాల్లో ఏది స‌క్సెస్ అయ్యాయో తేలాలంటే మే 23 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.
Tags: Interesting politics in Kurnool

భువనగిరిలో ఎలక్షన్ల వేడి

 Date:25/03/2019
నల్గొండ  ముచ్చట్లు
లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ తలపడనున్నాయి. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో ఉన్న జనగామ నియోజక వర్గంతో పాటు వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న  స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ‘ఎంపీ’ ఎలక్షన్ల వేడి మొదలైంది. ఆయా నియోజక వర్గాల పరిధిలోని మండల, జిల్లా నాయకులతో పాటు ఎమ్మెల్యేలు విశ్రాంత ఉద్యోగులు, ఆయా వర్గాల్లోని వ్యాపారులు, యువకులు, ఉద్యోగులతో పాటు పార్టీలకు అతీతంగా తటస్థంగా ఉన్న ఓటర్లపై కన్నేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారడంతో  ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఆయా గ్రామాల్లో ప్రముఖులను కలుస్తూ అన్ని వర్గాల ప్రజల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.   పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని మిగతా పార్టీలు కిందస్థాయి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి. నామినేషన్ల ప్రక్రియ షెడ్యూల్‌ కోసం మరో రెండు రోజుల గడువు ఉండడంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల పర్వం మొదలు కాకముందే ఎవరికి వారే తమ ప్రత్యర్థుల కదలికలను గమణిస్తున్నారు.
గ్రామాల వారీగా చేరికలకు శ్రీకారం చుడుతూ ముఖ్యులపై కన్నేస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే ఎక్కువ సమయం కేటాయి స్తున్నారు. పార్టీలకు సంబంధం లేని ఓటర్ల హృదయాలను గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6,96,535 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,48,301, పురుషులు 3,48,222, ఇతరులు 12 మంది ఉన్నారు.నామినేషన్ల సమయం దగ్గర పడుతుండడంతో…గ్రామాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్‌లో ఆప్యాయంగా పలకరిస్తూ… పార్టీ సంగతుల గురించి వాకబు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు బతుకు దెరువు కోసం వెళ్లి… సొంత గ్రామాల్లో ఓటు హక్కు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.  వీరంగా ఎన్నికల సమయంలో సొంత గ్రామాలకు వచ్చి.. ఓట్లు వేస్తారు.
Tags;Heat of Elections in Bhuvanagiri

మార్చి 6 తర్వాత టీ కాంగ్రెస్ జాబితా

Date:02/03/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల తరువాత సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ… ఇందుకోసం కసరత్తును ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ లోక్ సభ అభ్యర్థులను కూడా ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఒక్కో స్థానానికి రెండు మూడు పేర్లతో జాబితాను తయారు చేసిన టీ పీసీసీ… ఆ జాబితాను హైకమాండ్‌కు పంపించింది. ఇందులో ఎక్కువగా పోటీ లేని కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్ధులను బరిలోకి దించేందుకు జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల వివరాలను ఇప్పటికే సేకరించింది. అయితే ఎవరిని బరిలోకి దింపాలన్న అంశంపై ఇప్పటికే టిపిసిసి ఒక జాబితాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జాబితా పరిశీలన కోసం టిపిసిసి నాయకత్వం ఇప్పటికే ఎఐసిసికి అందచేసినట్టుగా సమాచారం.
ఒక్కో నియోజకవర్గం నుంచి ఎంత మంది నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు, వారిలో దీటైన అభ్యర్థులు ఎవరు,అన్న తదితర అంశాలను కూడా టిపిసిసి అధిష్టానికి అందచేసిన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. అయితే ఇంకా ఎన్నికల షెడ్యుల్ వెలువడని నేపథ్యంలో రెండు, మూడు దఫాలుగా పార్టీ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం చేపట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరమే అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించే అవకాశమున్నట్లుగా పార్టీ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పదిహేను లోక్‌సభ నియోజకవర్గాలకు గాను దాదాపుగా పదహారు నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను రూపొందించారు.మార్చి 6 తరువాత ఏ క్షణంలోనైనా ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పొత్తులు లేకుండానే 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. భువనగిరి నుంచి మధుయాష్కీ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నుంచి సోహెల్, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్ గిరి నుంచి కూన శ్రీశైలం గౌడ్ పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక నిజామాబాద్ నుంచి మాజీమంత్రి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ… ఇందుకోసం ఆయనను ఒప్పించే బాధ్యతను టీ పీసీసీకి అప్పగించిందని సమాచారం.ఇక ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, జహీరాబాద్ స్థానాలకు కోసం ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో… ఇక్కడి ఎవరికి ఛాన్స్ లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెదక్ స్థానానికి గాదె అనిల్ కుమార్ ను ఫైనల్ చేయడంపై పార్టీ నేతల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌పార్టీ క్యాంపు రాజకీయం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీ క్యాంపు రాజకీయం షురూ చేసింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే….ఆరుగురు పోటీలో ఉండటంతో కాంగ్రెస్‌కు క్యాంపు రాజకీయం అనివార్యమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పరిస్థితిపై పార్టీ ముఖ్యనేతలు చర్చించినట్టు తెలిసింది. ముందస్తు ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 9 మంది సీనియర్‌ ఎమ్మెల్యేలు, 10 మంది జూనియర్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జూనియర్‌ ఎమ్మెల్యేలను అధికార టీఆర్‌ఎస్‌ లాగే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడంతోపాటు వారిని ఎక్కడో ఒక చోట క్యాంపు వేయాలని భావిస్తున్నది. పది రోజులపాటు కర్నాటక రాష్ట్రానికి తరలించాలా? లేదా విదేశాలకు తరలించాలా? లేక ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉంటే అక్కడే ఎమ్మెల్యేలు ఉండేలా చర్యలు తీసుకోవాలా? ఇలా అనేక అంశాలపై ప్రాథమికంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. రెండు రోజుల్లో క్యాంపునకు తుదిరూపం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ క్యాంపునకు యువ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాలు చెప్పాయి. కాంగ్రెస్‌ పార్టీ తరుపున బరిలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు.
Tags:List of Tea Congress after March 6

టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, జ‌న‌సే పార్టీలు పోటీ

Date:20/02/2019
తిరుపతి ముచ్చట్లు:
రాజ‌కీయ భ‌క్త‌ులు…ఓట‌రు దేవుళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి క్యూలు క‌డుతున్నారు. ఇక్క‌డి నుంచి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, జ‌న‌సేన ఇలా దాదాపు అన్ని ప్ర‌ధాన పార్టీలు పోటీకి సిద్ధ‌మ‌వుతుండ‌టం విశేషం. ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కావ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. నిత్యం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకుంటూ ఉంటారు. ఆల‌యానికి కాదు ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గానికి మంచి చ‌రిత్రే ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన త‌ర్వాత ఆయ‌న ఇక్క‌డి నుంచి తొలిసారిగా పోటీ చేసి విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో చిరంజీవి కూడా అంతే ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి ఇక్క‌డి నుంచే పోటీ చేశారు…గెలిచారు.ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి టీడీపీ త‌రుపున సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నా బీ ఫామ్ వ‌చ్చే వ‌ర‌కు ఆమెకు సీటు వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. ఆమెతో పాటు వూకా విజ‌య్‌కుమార్‌, డాక్ట‌ర్ సుధారాణి కూడా టికెట్ కోసం త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేసుకుంటున్నారు.
సుగుణ‌మ్మ భ‌ర్త వెంక‌ట‌ర‌మ‌ణ గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించారు. సుధీర్ఘ‌కాలం పాటు ఆయ‌న కాంగ్రెస్‌లో ప‌నిచేశారు. మంచి ప‌దవుల్లొ కొన‌సాగారు. 2014కు ముందు జ‌రిగిన కొన్ని ప‌రిణ‌మాల‌తో ఆయ‌న టీడీపీలోకి వ‌చ్చేశారు. కాంగ్రెస్‌ నుంచి 2004లో ఆయ‌న ప్ర‌ముఖ సినీనిర్మాత ఎన్‌వి.ప్ర‌సాద్‌పై పోటీ చేసి గెలిచారు. 2014లో మ‌రోసారి టీడీపీ నుంచి ఘ‌న‌విజ‌యం సాధించారు. అనారోగ్యంతో ఆయ‌న 2015క‌న్నుమూశారు. ఉప ఎన్నిక‌లో సుగుణ‌మ్మ గెలుపొందారు. ఈసారి కూడా దాదాపు ఆమెనే టీడీపీ అధిష్ఠానం ఎంపిక చేసే యోచ‌న‌లో ఉన్నా మ‌రింత బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో కొన్ని పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.పార్టీల విష‌యానికి వ‌స్తే వైసీపీ నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవాస్తానం మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆయ‌న‌తో పాటు యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన గుణ‌శేఖ‌ర్ కూడా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అయితే ఇక్క‌డ భూమ‌న‌కు కాకుండా మిగ‌తా వారికి సీటు కేటాయింపు చేసేందుకు జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌ర‌ని నిన్న‌టి వ‌ర‌కు వార్త‌లు ఉన్నా గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎన్‌వి.ప్ర‌సాద్ భార్య పేరు సైతం బ‌లిజ కోటాలో తెర‌మీద‌కు వ‌స్తోంది.
ఇక బీజేపీ విష‌యానికి వ‌స్తే ఆకుల స‌తీష్‌కుమార్‌, అదే పార్టీకి చెందిన రాష్ట్ర‌కార్య‌ద‌ర్శి భాను ప్ర‌కాశ్‌రెడ్డి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ‌ర్గానికి చెందిన న‌వీన్‌కుమార్‌రెడ్డి రేసులో ఉన్నారు. మ‌రో ఇద్ద‌రు నేత‌లు కూడా బ‌లంగా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్లు స‌మ‌చారం.ఇక జ‌న‌సేన నుంచి ఇప్ప‌టి వ‌ర‌కైతే అభ్య‌ర్థుల పేర్లు విన‌బ‌డ‌టం లేదు. కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఖ‌చ్చితంగా అభ్య‌ర్థిని నిల‌బెడుతార‌న్న‌ది నిర్వివాదాంశం. ఇక బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెడితే గెలిచే అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయి. గ‌తంలో ప‌వ‌న్ అన్న చిరంజీవి ఇక్క‌డి నుంచి ఎన్నికైన నేప‌థ్యంలో ప‌వ‌న్ కళ్యాణ్ కూడా ఇక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఏ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం విశేషం. ఆశావ‌హులు మాత్రం ఎవ‌రికి వారు మాకే టికెట్ వ‌స్తుందంటే మాకే అంటూ ప్ర‌చారం సాగిస్తున్నారు. మొత్తంగా ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కొలువైన నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా అన్‌క్లారిటీ నెల‌కొని ఉండ‌టం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే స‌స్పెన్స్‌కు తెర‌తీయ‌నుంది.
Tags: TDP, Congress, BJP and Jan Sangh are contesting

 మెదక్ పార్లమెంటరీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ?

Date:14/02/2019

మెదక్  ముచ్చట్లు:
   మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉండబోతున్నారో అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవల వరుసగా అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో హోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరిని బరిలో దింపాలో తేల్చుకోలేక పోతుంది. అభ్యర్థులైతే పత్తా లేకుండా పోయారు. వారి కోసం పని చేసిన ద్వితీయ శ్రేణి నేతలు దిగాలు చెందారు. ప్రతి చోటా భారీ తేడాతో ఓడిపోవడంతో జిల్లాలో గులాబీ దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో ఆశతో బరిలోకి దిగిన బడా నేతలు మట్టి కరిచారు. కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసిన నాడు జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా కనిపించారు. జిల్లాలో ఖచ్చితంగా సగానికి సగం గెలుస్తామన్న అంచనాల్లో రంగంలోకి దిగారు. రాను రాను పరిస్థితి టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నా.. వారి ఆశలు మాత్రం చావ లేదు. చివరకు ఘోర పరాభవాన్ని మూట కట్టుకున్నారు.
కేవలం సంగారెడ్డి మినహా అన్ని చోట్లా ఘోరంగా ఓడిపోయారు. దారుణ పరాభవాన్ని చవి చూశారు. గట్టి పోటీ ఉందని ఆ పార్టీ వర్గాలు భావించిన ఆంథోల్, జహీరాబాద్, పటాన్‌చెరు, నర్సాపూర్‌లో కూడా భారీ తేడాతో ఓడిపోయారు. దీంతో నేతలు ఖంగుతిన్నారు. ఈ దెబ్బకు గజ్వేల్ కాంగ్రెస్ నేత ప్రతాపరెడ్డి ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పారు.మిగిలిన నియోజకవర్గాల్లో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లోనూ తీరు మార లేదు.చాలా చోట్ల పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటమి తప్ప లేదు. వారిని పలకరించిన నేతలు కూడా లేకుండా పోయారు. దీంతో గ్రామాల్లో కూడా ఆ పార్టీ తరపున పని చేసే నేతలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో పార్టీ తరపున పోటీపై చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయంగా కనపడుతోంది. ఘోర పరాభవం ఖాయంగా ఉంది. దీంతో మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తారా? అని అంతా ఆస్తకిగా ఎదరుచూస్తున్నారు. గతంలో దివంగత ప్రధాని ఇందిరా గాందీ ప్రాతినిధ్యం వహించిన చోట ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదర్కోవడం గమనార్హం.స్టార్ కాంపెయినర్, మెదక్ మాజీ ఎంపి విజయశాంతి పేరు ప్రముఖంగా వినపడుతోంది.
ఇటీవలి ఎన్నికల్లో ఆమె మెదక్ లేదా దుబ్బాక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు ఆమె బరిలోనే లేకుండా ప్రచారానికే పరిమితమయ్యారు.దీంతో ఆమెను పార్టీ పెద్దలు పార్లమెంట్ బరిలో దింపుతారని అంటున్నారు.బరా బర్ ఓడిపోతామని తెలిసిన స్థానంలో విజయశాంతి బరిలోకి దిగుతారా?ఓటమిని మరో సారి మూట కట్టుకుంటారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక ఇటీవల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల పేరు కూడా వినపడుతోంది. తన భార్య కోసం ఎంపి టికెట్ అడుగుతానని జగ్గారెడ్డి ఇంతకు ముందు అనేక సార్లు ప్రకటించారు. దీంతో ఆమె పేరు తాజాగా చర్చల్లోకి వచ్చింది. కాకుంటే ఇటీవల జగ్గారెడ్డి వ్యవహారశైలి కారణంగా కొంత అనుమానం కూడా కలుగుతోంది.వీరిద్దరు కాకుండా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరు కూడా వినపడుతోంది. సిఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రాంత నేత కావడంతో నర్సారెడ్డిని నిలిపితే సిద్దిపేట జిల్లాపై కొంత ప్రభావం ఉంటుందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
వీరే కాకుండా పటాన్‌చెరు ప్రాంత నేతలు సపాన్‌దేవ్, గాలి అనిల్‌కుమార్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.వీరిరువురికి ఇటీవల పటాన్‌చెరు అసెంబ్లీ టికెట్ మిస్సయింది. దీంతో పార్లమెంట్‌కైనా బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అదే సమయంలో బడా నేతలు కూడా వెనుకంజ వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ..పోటీ చేస్తారా ? అన్నది బరిలోకి దిగినప్పుడే తెలుస్తుంది.
Tags:Who is the Medak Parliamentary Congress candidate?

నీచ రాజకీయాలకు పాల్పడుతోన్న కాంగ్రెస్ 

తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం: ఎంపీ గోడంనగేశ్‌
Date:03/12/2018
ఆదిలాబాద్‌ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ మండిపడ్డారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఆ పార్టీ దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తాను తెరాస నుంచి పోటీ చేస్తానని స్పష్టంచేశారు. సోమవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని, దీన్నితీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలకు ఆదిలాబాద్‌ లోక్‌సభ నుంచి తెరాస అభ్యర్థిగా బీ ఫామ్‌ తన జేబులోనే ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తాలేక వివిధ పార్టీలతో మహా కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. మహాకూటమిని తెలంగాణ ప్రజలెవరూ నమ్మడంలేదని చెప్పారు. తన ప్రతిష్ఠకు భంగం కల్గిస్తే సహించేది లేదని, దుష్ప్రచారం చేసినవారిపై పరువు నష్టం దావా వేస్తానని నగేశ్‌ హెచ్చరించారు.
Tags:The Congress,

 అవిశ్వాసంపై రంగంలోకి దిగిన కాంగ్రెస్

Date:24/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నేరుగా రంగంలోకి దిగింది. ఏపీకి ప్రత్యేక khargeహోదా, విభజన హామీల అమలులో విఫలైవెునందుకు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను కలిసి నోటీసు ఇచ్చారు. ఈ నెల 27న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీ జేడీ శీలం, తదితరులు ఉన్నారు. కేంద్రానికి టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు నేరుగా నోటీసు ఇవ్వడం కీలక పరిణామం.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చాలా మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చకు అవకాశం కల్పించాల్సిందేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాకా కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే అంశంలో వైసీపీ, టీడీపీలు విడివిడిగా ఇచ్చిన నోటీసులు చర్చకు వచ్చినా తాము మద్దతుగా నిలబడతామని తెలిపారు.
Tags:The Congress, which landed on infidelity