పేదముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ

Date:12/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని పేద ముస్లిం కుటుంభాలకు చెందిన 25 మందికి రంజాన్‌ తోఫాను పంపిణీ చేశారు. పట్టణంలోని ఫాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పార్టీకి చెందిన డివిజనల్‌ అధ్యక్షుడు ఫయాజ్‌, స్థానిక అధ్యక్షుడు అతిక్‌ ఆధ్వర్యంలో రూ.2 వేలు విలువ చేసే తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్‌ మాట్లాడుతూ పేద ముస్లింలు సంతోషంగా పండుగను నిర్వహించుకునేందుకు అన్ని రకాల ఆహార వస్తువులు కలిపి పంపిణీ చేయడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా రంజాన్‌ ఉపవాసాల వెహోదటి వారంలో 25 కుటుంభాలకు పంపిణీ చేశామన్నారు. ఈనెల రోజుల పాటు ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. పట్టణంలోని పేద ముస్లింలను ఆదుకోవడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆసిఫ్‌, అతిక్‌బాషా, బావాజాన్‌, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు జయప్రదం చేయండి

 

Tags; Ramadan delivering poverty to the poor