భారతరాష్ట్రపతి తిరుమలరాక

– ప్రధమ పౌరునికి ఘన స్వాగతం

Date:13/07/2019

తిరుమల ముచ్చట్లు:

భారతరాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ కుటుంబ సమేతంగా శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, స్పెషలాఫీసర్‌ ధర్మారెడ్డి, ఈవో అశోక్‌ సింఘాల్‌, జెఈవో బసంత్‌కుమార్‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఇఫ్తికఫాల్‌ స్వాగతం పలికారు. రాష్ట్రపతి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని వెహోక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రపతి రెండు రోజుల పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

332వ రోజు జనగణమనకు న్యాయమూర్తి వందనం

Tags; Thirumalaraka, President of India