అనంతలో అడగుంటున్న భూగర్భ జలాలు

Date:16/04/2019
 అనంతపురం ముచ్చట్లు :
సాగు నీరు లేక వర్షాధార వ్యవసాయంతోనే  బతుకుతున్న రైతన్నలకు ఈ ప్రాజెక్టు.. కొండంత ఆశలు రేకెత్తించింది. దశాబ్దాల కల రైతుల కళ్లెదుట కనిపించేలా చేసి.. ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీరు బయటకు వదలడంతో గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాల పరిధిలోని రైతులలో ఆనందం నెలకొంది. ప్రాజెక్టులోకి నీరు సమృద్ధిగా చేరితే రాయచోటి నియోజకవర్గ పరిధిలోని గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందడంతోపాటు వేలాది ఎకరాల సాగుకు అనువుగా భూగర్భ జలాలు పెంపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయితే వర్షం ఎప్పుడు కురిసి నీరు వచ్చినా పంటలను సాగు చేసుకోవచ్చన్న సంతోషం రైతుల్లో కనిపించింది. ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాల్వల కింద 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 60 కిలోమీటర్ల మేర కాలువలను తవ్వారు.4.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన నాటి నుంచి నేటి వరకు నీటితో కళకళలాడకపోయినా.. అడుగు భాగంలో ఉన్న 0.7 టీఎంసీల నీరు ఆ ప్రాంతంలో భూగర్భజలాల పెంపుదలకు దోహదం చేస్తోంది. కడప–అనంతపురం–చిత్తూరు జిల్లాల సరిహద్దులో వెలిగల్లు వద్ద పాపాఘ్ని నదిపై ప్రాజెక్టును నిర్మించాలని బ్రిటీష్‌ ఇంజినీర్లు నిర్ణయించారు. నాటి నుంచి అదిగో, ఇదిగో ప్రాజెక్టు అంటూ హామీల మీద హామీలు గుప్పిస్తూ వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో నడుస్తున్న పనులను చూసి మరెన్ని దశాబ్దాలకు ప్రాజెక్టు పూర్తవుతుందోనన్న అనుమానాలు.. అసలు ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న బెంగ నెలకొని ఉండేది. కారణం కొన్ని దశాబ్దాల క్రితం వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించాలని తలచినా.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, వ్యవసాయం దండగ అన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు ఈ ప్రాంత రైతులు ఆశలను వదులుకునేలా చేసింది. 2003లో ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్సార్‌ శిలాఫలకం వద్ద మొక్కలు కూడా నాటారు. ఇలాంటి తరుణంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీఎం అయ్యారు. ఆయన హయాంలో నిధులు వరదలా పారడంతో 2008లోనే పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి  ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మహానేత హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులలో పూర్తయిన మొదటి ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది.తాగునీటి కోసం పరితపించే రాయచోటి పట్టణ ప్రజలకు వెలిగల్లు ప్రాజెక్టు ఓ వరంలా మారింది. దశాబ్దాల కాలం నుంచి తాగునీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. వైఎస్సార్‌ హయాంలో 48 కోట్ల రూపాయలను మంజూరు చేసి 30 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు చేశారు. దీంతో రాయచోటి పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.
Tags:The underground waters that are being asked in Anantha