బ్యాట్మెంటెన్‌లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు

Date:05/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఫ్రెండ్స్ షెటిల్‌ ఆసోసియేషన్‌, చిత్తూరు జిల్లా బ్యాట్మెంటెన్‌ ఆసోసియేషన్‌ సంయుక్తంగా విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రతినిధులు డాక్టర్‌ శరణ్‌ , మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో కోచ్‌ ప్రబాకర్‌ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన సాయివిఘ్నేష్‌, విష్ణు, లలిత్‌, జోషిత్‌, బాష్య, వేదసంహిత, జయసృజిత, నేహ, వెంకటసాయికి సర్టిపికెట్లు, మెమెంటోలు అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శరణ్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, టోర్నమెంట్లకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడల్లో బాగస్వామ్యులను చేయాలని , దీని ద్వారా క్రీడా రిజర్వేషన్లతో ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు వీలుందన్నారు.

కాలుష్య నివారణ , చట్టాలపై అవగాహన ఎంతో అవసరం

Tags: Gifts for students who won in the batmenton