ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి సన్మానం

Date:22/05/2019

 

తిరుపతి ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తెలంగాణకు చెందిన ఎస్‌కెటి గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్ సంస్థల ప్రతినిధులు దోసపాటి రాము, పిచ్చేశ్వరరావు బుధవారం ఘనంగా సన్మానించారు. తిరుపతిలోని ఎమ్మెల్యే ఇంటికి తిరుపతికి చెందిన అత్తులూరి ట్రస్ట్ చైర్మన్‌ ఉమామహేశ్వరరావు, జిఎస్‌.రావు, ఈవిటి.నరసయ్యతో కలసి వెళ్లారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి శాలువ కప్పి , పూలతో సత్కరించారు. ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, ముందుగా సన్మానం చేసేందుకు వచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాము తదితరులను అభినందించి పంపారు.

 

కౌంటింగ్ యధావిధంగానే

Tags: MLA Peddired Reddy is honored