టార్గెట్ బాబుగా అడుగులు

Date:12/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్ కావడం గమనార్హం. బుగ్గన తన బడ్జెట్ ప్రసంగాన్ని మహాత్మా గాంధీ పేరు ప్రస్తావనతో ప్రారంభించారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు. రైతుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

 

 

 

నవరత్నాల అమలుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే బుగ్గన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో నమోదైందని గత ప్రభుత్వం పేర్కొందని, అయితే ఈ వృద్ధి రేటును మరోసారి సమీక్షిస్తామని బుగ్గన తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధి రేటు నమోదైతే రైతుల చావులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఆకలి చావులు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదన్నారు. అలాగే నిరుద్యోగం కూడా పెరిగిందని తెలిపారు.

కర్ణాటక  పాలిటిక్స్ మరాఠ లీడర్

Tags:Ft. As Target Babu