ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని సన్మానించిన చింతపండు వ్యాపారులు

Date:27/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నూతన ఎమ్మెల్యేగా మూడవ సారి ఎన్నికైన డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చింతపండు వ్యాపారులు, పట్టణ ప్రముఖులు తిరుపతికి వెళ్లి సన్మానించారు. సోమవారం చింతపండు వ్యాపారులు కొండవీటి నాగముని, చాంద్‌బాషా, ఎస్‌కెపి ఖాజా, అమ్ము, ఎంఎస్‌.సలీం, పి.మస్తాన్‌, కిజర్‌ఖాన్‌, అర్షద్‌, ఇమ్రాన్‌, అఫ్సర్‌ ఆధ్వర్యంలో సుమారు 100 మంది చింతపండు వ్యాపారులు కలసి ఎమ్మెల్యేకు శాలువకప్పి సన్మానం చేశారు. అలాగే జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఆయన తనయుడు యువ వ్యాపారవేత్త శ్రీనివాసతేజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజారెడ్డి, కో-ఆప్షన్‌మెంబర్‌ ఖాదర్‌బాషా ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే శ్రీనివాసతేజకు శాలువకప్పి సన్మానించారు. న్యాయవాది వెంకట్రమణారెడ్డి, వ్యాపారి సుధాకర్‌రెడ్డి ఎమ్మెల్యేని కలసి సన్మానించారు.

 

వైఎస్సార్సీపి సంబరాలు

Tags: The tamarind traders who honored MLA Peddyareddy