బజారువీధికి మునస్వామిశెట్టివీధిగా మార్పు

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఆర్యవైశ్య శిరోమణి అవార్డు గ్రహీత దివంగత ఎస్‌పి.మునస్వామిశెట్టి పేరుతో బజారువీధిని మార్పు చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆదివారం విలేకరులకు తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మునస్వామిశెట్టి పేరుతో బజారువీధిని మార్పు చేస్తూ చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌తో కలసి పాలకవర్గం ఆమోదించిన మేరకు ఉత్తర్వులను ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, గౌరవ అధ్యక్షుడు ముల్లంగి విజయకుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు ముల్లంగి విజయకుమార్‌ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన మునస్వామిశెట్టి పేరును బజారువీధికి పెట్టడం ఆమోదయోగ్యమన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నవీన్‌కుమార్‌, పి.శ్రీధర్‌, మోహన్‌, ప్రవీన్‌కుమార్‌, రాజేందప్రసాద్‌, ఇట్టాబానుప్రకాష్‌, దొంతివెంకటేష్‌ , బాను, మురళి, రవికుమార్‌, నాగరాజ, రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ అత్తి వరదరాజ స్వామి దర్శన భాగ్యం

Tags: The transformation of the bazaarvidhi into a munaswamishettidi