పాఠశాల భవనంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి.. బాలికలపై టీచర్ల పైశాచికం

– విశాఖలో హెచ్‌ఎం, టీచర్‌ అరెస్టు

Date:15/08/2019

విశాఖపట్నం/ఆనందపురం ముచ్చట్లు:

 

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు వక్రమార్గం పట్టారు. అభంశుభం తెలియని చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పని ఉందని పిలిచి, జుగుప్స కలిగించే చేష్టలకు పాల్పడుతున్నారు. విద్యార్థినుల రహస్య ప్రదేశాలను తాకడం, ఫొటోలు తీయడం చేస్తూ, క్లాస్‌రూమ్‌లనే కీచక కేంద్రాలుగా మార్చేశారు. తమ టీచర్ల నీచత్వాన్ని రెండేళ్లుగా ఆ చిన్నారులు పంటిబిగువున మూగగా భరిస్తున్నారు. ఈ బాగోతం ఎట్టకేలకు బహిర్గతం కావడంతో ఆ ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు వారిద్దరినీ సస్పెండ్‌ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నం జిల్లా పెద్దిపాలెం ప్రాథమిక పాఠశాలలో తగరపువలసకు చెందిన జి.వెంకటేశ్వర్లు (55) హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. మరో ఉపాధ్యాయుడు సుందరరావుతో కలిసి పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. బుధవారం ఉదయం మూడు, నాలుగు చదివే ఇద్దరు విద్యార్థినులను వెంకటేశ్వర్లు, సుందరరావు.. పాఠశాల భవనంలోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. వారి పట్ల అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కేంద్రం వైద్యులు రెగ్యులర్‌గా నిర్వహించే వైద్య పరీక్షల్లో ఈ బాలికలపై అఘాయిత్యం జరిగినట్టు తేలింది. వెంటనే ఆనందపురం పోలీసులకు వైద్యులు సమాచారం అందించారు. విచారణలో మరో ఏడుగురు బాలికలు కూడా తమకు జరిగిన అన్యాయం బయటపెట్టారు.

రాబోయే రెండేళ్లలో ప్రతీ ఒక్కరికీ ఇల్లు, 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే టార్గెట్: మోదీ 

Tags: Take him to a room in the school building