విద్యుత్ఘాతానికి ముగ్గురు పిల్లలు మృతి

Date:14/08/2019

ఒంగోలు ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కోప్పరం గ్రామంలో విషాద ఘటన జరిగింది.విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు చిన్నారుల మృతి చెందారు. కొప్పవరంలో కోదండరామస్వామి ఆలయ

ప్రధాన కూడలి వద్ద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ జెండాను ఆవిష్కరించింది.  ఆ జెండా స్థంభంతో  ఆడుకుంటన్నారు.  దానికి పైనున్న 11 కేవీ కరెంటు తీగలకు తగిలి కరెంట్ షాక్ తగిలి

ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు దీంతో గ్రామంలో  విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణించిన చిన్నారులు షేక్ పఠాన్ గౌస్ (11), షెక్ హసన్ బుడే (11), పఠాన్ అమర్ (11).

పిల్లలంతా ఐదవ తరగతి చదువుతున్నారు. జెండా స్తంభానికి పక్కనే ఉన్న విద్యుత్ లైన్ తగలడంతో విద్యుత్ సరఫరా అయినట్లు స్థానికులు చెబుతున్నారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

వరుస తప్పులతో కాంగ్రెస్ కష్టాలు

Tags: Three children killed in electrocution