శామీర్‌పేట సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

Date:12/08/2019

మేడ్చల్  ముచ్చట్లు:

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలోని హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి మరో కారుపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. సీఐ నవీన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు కరీంనగర్‌ ‌నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. శామీర్‌పేట పరిధిలోకి రాగానే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అదుపు తప్పి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు వేగంగా రావడంతో ఒక్కసారిగా పల్టీలు కొడుతూ ఎదురుగా హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ వైపు వస్తున్న కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారు డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తన వరకు వస్తే కానీ  కేటీఆర్ కు అసలు తత్వం బోధపడ లేదు

Tags: Three dead in road accident near Shamirpet