పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి

– మెప్మా పీడీ నాగజ్యోతి

 

Date:25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు తమ ఇండ్ల వద్ద, ఖాళీ స్థలాల్లో వెహోక్కలు పెంచాలని మెప్మా పీడీ నాగజ్యోతి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని సంకల్ప సోసైటి వారి ఆధ్వర్యంలో వెహోక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా పీడీ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారించకపోతే పెను ప్రమాదాలు సంబవిస్తుందన్నారు. ఇందుకు గాను ప్రతి ఒక్కరు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేదించాలన్నారు. అలాగే వెహోక్కలు నాటడం చేపట్టాలన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటి పరిధిలో హ్గం కంపోస్ట్ విధానాన్ని అమలు పరుచుకోవాలని సూచించారు. ఇందుకోసం డస్ట్ బిన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా కో-ఆర్డినేటర్‌ రవి, సీవోలు మయూరి, జయంతి, సంకల్ప సోసైటి సభ్యులు కుమారి, రాజా, జానకి తో పాటు టౌన్‌ సభ్యులు పాల్గొన్నారు.

 

అక్షరాస్యులుగా మారి చట్టాలను అవగాహన చేసుకోవాలి

Tags: Avoid environmental pollution