పెద్దిరెడ్డి కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు , ఒక ఎంపి

– పెద్దిరెడ్డి రికార్డు

Date:23/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా రాజకీయాలలో తనకంటు ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఎక్కడైనా పెద్దిరెడ్డి మార్క్ ఉండేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. ఇలా ఉండగా 2014 ఎన్నికల్లో తన కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిని రాజంపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపి తరపున పోటీలో నిలబెట్టి, తన ప్రత్యర్థి నందమూరి పురంధేశ్వరిపై 1.70 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అలాగే ఈసారి ఎన్నికల్లో మిధున్‌రెడ్డి రెండవ సారి ఎంపీగా 1.50 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా ఉండగా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించి, పెద్దిరెడ్డి కుటుంబం రికార్డు సృష్టించింది. జిల్లాలోని పలువురు అభ్యర్థుల గెలుపుకు కృషి చేసి, పెద్దాయనగా పేరుగాంచారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి , ద్వారకనాథరెడ్డి , మిధున్‌రెడ్డి లు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతోనే తమ కుటుంబానికి పదవులు లభిస్తోందని , ప్రజలకు ఏమి చేసిన రుణం తీర్చుకోలేమమంటు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అభినందన మాల

Tags: Two MLAs in the Peddireddy family, one MP