జాతీయ లోక్‌అదాలత్‌లో 123 కేసులు పరిష్కారం

– రూ.63,99,985 లక్షలు పరిహారం చెల్లింపు

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు కోర్టు ఆవరణంలో జాతీయ మెగాలోక్‌అదాలత్‌ను సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు భారతి, రమణారెడ్డిలు కలసి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నిరకాలకు చెందిన 123 కేసులను పరిష్కరించి, రూ.63,99,985 లక్షలు పరిహారం చెల్లింపు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్‌ మాట్లాడుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు ఆదేశాల మేరకు జాతీయ మెగాలోక్‌అదాలత్‌ను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సత్వరం న్యాయం అందించడమే లక్ష్యంగా లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల కేసులను ప్రజలు పరిష్కరించుకునే దిశగా ఆలోచనలు చేయాలన్నారు. పట్టింపులతో కేసులు నడుపుకోవడంతో అధికవ్యయముతో పాటు తీవ్ర కాలయాపన జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు సామరస్యధోరణితో సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైయ్యే తీర్పులకు అప్పీల్‌ ఉండదని, తుదితీర్పు లోక్‌అదాలత్‌లదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోన్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, కార్యదర్శి ఆనందకుమార్‌, న్యాయవాదులు విజయకుమార్‌, బాలాజికుమార్‌, వెంకటమునియాదవ్‌, శ్రీరాములురెడ్డి, మల్లికార్జునరెడ్డి, శివశంకర్‌నాయుడు, వెంకట్రామయ్యశెట్టి, రఘునాథరెడ్డి, ప్రశాంతి, రవి, జమీల్‌, సమివుల్లా తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌డబ్యూజ్లిఎస్‌ డీఈఈగా వెంకటేశ్వర్లు

Tags: 123 cases resolved in National Lok Adalat