ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని సన్మానించిన పట్టణ ప్రముఖులు

Date:26/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నూతన ఎమ్మెల్యేగా మూడవ సారి ఎన్నికైన డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలువురు పట్టణ ప్రముఖులు తిరుపతికి వెళ్లి సన్మానించారు. ఆదివారం పట్టణంలోని పుంగనూరు వెల్‌విషర్స్ గ్రూప్‌ సభ్యులు కొండవీటి నాగభూషణం, విశ్వనాథం, డాక్టర్లు శివ, శరణ్‌, జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి, కెసిటివి అధినేత ముత్యాలు, అయూబ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, స్యుధాకర్‌రెడ్డి, మదుసూదన్‌రెడ్డి, త్రిమూర్తిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మహేంద్రరావు, గోపాలక్రిష్ణ లు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివ ను ఎమ్మెల్యే సన్మానించారు. అలాగే పట్టణ వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ కార్యదర్శి అర్షద్‌అలి కలసి ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే వెంకటాచలపతిశెట్టిని శాలువ కప్పి సన్మానించారు. అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇఫ్తికార్‌, కౌన్సిలర్లు మనోహర్‌, అమ్ము, తెలుగుదేశం కౌన్సిలర్‌ కుమార్‌రాజ, నేతలు ఖాదర్‌, నూర్‌, అస్లాంమురాధితో పాటు పారిశ్రామికవేత్త ఆర్‌విటి.బాబు , రాజా, తదితరులు ఎమ్మెల్యేకు సన్మానం చేశారు.

 

వైఎస్సార్సీపి విజయంపై సంబరాలు

Tags: Urban Celebrities Honored by MLA Peddireddy