పుంగనూరులో మూడురోజులకొక్కసారి నీటి సరఫరా

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని 24 వార్డుల్లోను సుమారు 65 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ మూడు రోజుకొక్కసారి మంచినీటిని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకు 4.2 ఎంఎల్‌డిల నీరు అవసరం. కాగా మున్సిపల్‌ అధికారులు 3.6 ఎంఎల్‌డిల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. పట్టణంలో వెహోత్తం మంచినీటి బోర్లు 63 ఉన్నాయి. అందులో 48 బోర్లు మాత్రమే పని చేస్తున్నాయి.ప్రభుత్వం నుంచి మంచినీటికి ఎలాంటి నిధులు విడుదల కాకపోవడంతో మున్సిపాలిటిలోని నిధులతో నీటి సరఫరా అరకొరగా సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటికి నాలుగు ట్యాంకర్లు ఉన్నాయి. అవి కాకుండ ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా రోజుకు 150 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసి, సంపులకు పంపి, కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

తప్పని నీటి కష్టాలు….

పట్టణంలో మున్సిపల్‌ అధికారులు గతంలో రోజు మార్చి రోజు నీటిని సరఫరా చేసే వారు. కానీ ప్రస్తుతం రెండురోజులు, మూడు రోజులకొక్కసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా అధికారుల నియంత్రణ లేకపోవడంతో నీటి సరఫరాలో సమస్యలు తీవ్రమౌతోంది. పట్టణ ప్రజలు 20 లీటర్ల మంచినీటి క్యాన్లకు రూ.20 లకు కొనుగోలు చేస్తున్నారు.

సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలు….

పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీ, మేలుపట్ల, రామ్‌నగర్‌, ఎంపీడీవో ఆఫీసు, షిరిడిసాయినగర్‌, మార్కెట్‌ యార్డు, గాంధినగర్‌, నానబాలవీధి, ఉర్ధూస్కూల్‌వీధి, ఎన్‌జీవో కాలనీ ప్రాంతాలలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.

ప్రజాసేవకు… విశ్వసనీయతకే పట్టం

 

Tags: Water supply for three days in Punganoor