బాబుపై విజయసాయి సెటైర్లు

Date:21/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఎన్నికల ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీయేతర పక్షాలను కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అవుతున్న ఆయన.. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా పార్టీలను ఏకతాటిపైకి నడిపే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్, సోనియా, పవార్, సీతారాం ఏచూరీ, మమతా బెనర్జీ లాంటి నేతలతో ఆయన తరచుగా భేటీ అవుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేదే మళ్లీ అధికారమని సూచించినప్పటికీ బాబు మాత్రం తన ప్రయత్నాలను విరమించుకోలేదు. కాంగ్రెస్ కూటమి కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల పట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ‘‘ఎన్డీయేతర పార్టీలకు ఆధిక్యత వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని రాష్ట్రపతికి లేఖ రాయాలని సోనియాకు చంద్రబాబు ఈ ‘త్రిసూత్ర’ వ్యూహాన్నివివరించారని కుల మీడియా పారవశ్యంతో రాసింది. త్రిసూత్ర ఏమో కాని ‘క్షార సూత్ర’ అని ఆయుర్వేదంలో ఒక చికిత్స ఉంది. బాబుకు అర్జెంట్‌గా ఆ చికిత్స అవసర’’మని ఆయన ట్వీట్ చేశారు.  ఎన్డీయేతర పార్టీలకు ఆధిక్యత వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని రాష్ట్రపతికి లేఖ రాయాలని సోనియాకు చంద్రబాబు ఈ ‘త్రిసూత్ర’ వ్యూహాన్నివివరించారని కుల మీడియా పారవశ్యంతో రాసింది. త్రిసూత్ర ఏమో కాని ‘క్షార సూత్ర’ అని ఆయుర్వేదంలో ఒక చికిత్స ఉంది. బాబుకు అర్జెంట్‌గా ఆ చికిత్స అవసరం.

 

 

 

 

 

 

‘ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌తో అనుసంధానం చేయడానికి చంద్రబాబు అంబికా అగరుబత్తిలా పనిచేస్తున్నా ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి పోతున్నాయి. బాబు వాడుతున్న ఫెవికాల్‌ (నకీలీది)తో బంధాలు ఒక పట్టాన అతకడం లేదట. ఢిల్లీకి రాలేమని మమత, మాయా, స్టాలిన్‌ చివరకు కుమారస్వామి కూడా చెప్పేశారట’’ అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌తో అనుసంధానం చేయడానికి చంద్రబాబు అంబికా అగరుబత్తిలా పనిచేస్తున్నా ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి పోతున్నాయి. బాబు వాడుతున్న ఫెవికాల్‌ (నకీలీది)తో బంధాలు ఒక పట్టాన అతకడం లేదట. ఢిల్లీకి రాలేమని మమత, మాయా, స్టాలిన్‌ చివరకు కుమారస్వామి కూడా చెప్పేశారట.ఢిల్లీలో అందరూ చంద్రబాబును ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా, వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట అని విజయసాయి అంతకు ముందు బాబుపై సెటైర్లు వేశారు.

 

ఈవీఎంలు తరలింపు కలకలం

 

Tags: Vijayasai Satyars on Babu