పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

Date:14/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితిపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చికిత్స చేయించుకున్న పోసాని మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై పోసాని కృష్ణమురళి స్పందించారు.

 

 

ఇటీవల తాను అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే కాని చికిత్స తరువాత కోలుకుంటున్నట్టుగా వివరించారు. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలిపిన ఆయన, మరో వారం పదిరోజుల్లో షూటింగ్‌లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్ధించిన వారందరికీ వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరం

Tags: Posani given Clarity on the rumors