రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

Date:13/07/2019

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా గుడిబండ మండలం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నకానిస్టుబుల్ జీ ప్రభాకర్ రెడ్డి  అనంతపురం లో రైల్వే డ్యూటీ ముగించుకొని శనివారం తెల్లవారుజామున ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కల్యాణదుర్గం రోడ్డు లో రాజా హోటల్ వద్ద జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.అనంతరం కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తమ సహచరున్ని కోల్పోవడంతో గుడిబండ పోలీసు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.  అలాగే కానిస్టేబుల్ కుటుంబసభ్యులు కూడాఈ ప్రమాద వార్త తెలుసుకుని బోరున విలపిస్తున్నారు. ఇతని కుటుంబం ఆత్మకూరు మండలం లోని తలుపురు గ్రామం లో వుంటుంది.

కరీంనగర్ జిల్లాలో కామ్రేడ్ల కొట్లాట రచ్చరచ్చ

Tags: Constable killed in road accident