జగనన్న రాకతో …పేదల ముంగిటకు నవరత్నాలు

– హర్షం వ్యక్తం చేస్తున్న జనం

 

Date:26/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్సీపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ద్వారా ప్రజలకు ఫలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన వెంటనే నవరత్నాలలోని పథకాలు పేదలకు అందించనున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ ఆసరా పథకం క్రింద వృద్దాప్య పెన్షన్‌ రూ.3 వేలు పంపిణీ చేయనున్నారు. అలాగే బలహీన వర్గాల మహిళలకు ఒకొక్కరికి రూ.75 వేలు చొప్పున అందజేయనున్నారు. వికలాంగులకు ప్రతి నెల రూ. 3 వేలు పంపిణీ చేయనున్నారు. రైతు భరోసా క్రింద ఒకొక్క రైతుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. విద్యార్థులకు ఉన్నత చదువులకు అయ్యే ఫీజులను సంపూర్ణంగా ఫీజు రియంబర్స్మెంట్‌ క్రింద వాపస్సు చేయనున్నారు. అలాగే ఇదే పథకం క్రింద చదుకునే పిల్లలకు హాస్టల్‌ ఖర్చుల క్రింద రూ.20 వేలు పంపిణీ చేస్తారు. అమ్మ ఒడి పథకం క్రింద స్కూల్‌ పిల్లలకు రూ.15 వేలు పంపిణీ చేయనున్నారు. వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులకు, స్వంత ఆటో కలిగిన వారందరికి రూ.10 వేలు ఇవ్వనున్నారు. ప్రదాన దేవాలయాలలో పని చేసే అర్చకులకు ఒకొక్కరికి రూ.10 వేలు ఇవ్వనున్నారు. వైఎస్సార్‌ పెళ్లికానుక క్రింద ప్రతి ఆడ బిడ్డకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే డ్వాక్రా రుణాలు ఎన్నికల పోలింగ్‌ తేదీ నాటికి ఉన్న వెహోత్తాన్ని మాఫి చేసి, మహిళలకు వడ్డీలేని కొత్తరుణాలు పంపిణీ చేయనున్నారు.

విశ్వాసంతో ఓట్లు వేశాం….

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన మేరకు అన్ని పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తారన్న విశ్వాసంతో వైఎస్సార్సీపికి ఓట్లు వేశాం. నవరత్నాలతో పెన్షన్లు, రైతులకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్‌ ఎంతో లబ్ధిచేకూరుతుంది. త్వరలోనే మా కష్టాలు తీరిపోతాయి.

– ఎంఎం.ఆనంద, వ్యాపారి, పుంగనూరు

అభివృద్ధికి తిరుగులేదు…

ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పదవి స్వీకారం చేసిన వెంటనే పేద ప్రజల కష్టాలు తీరి రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపి ప్రకటించిన పథకాలను అమలు పరుస్తారన్న నమ్మకంతో అందరు ఐకమత్యంతో ఓట్లు వేసి, వైఎస్సార్సీపిని గెలిపించాం.

– ఎన్‌.రెడ్డెప్ప, పుంగనూరు

మా కష్టాలు తీరిపోతుంది…

ప్రజలు పడుతున్న కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైంది. నవరత్నాలతో కార్మికులకు భరోసా లభిస్తోంది. విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్‌, కార్మికులకు , ఆటో డ్రైవర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని నవరత్నాలలో పేర్కొనడం హర్షనీయం. ఇలాంటి మహత్తర పథకాలను ప్రవేశపెడతామన్న జగన్‌ను ప్రజలు నమ్మి ఓట్లు వేశాం.

– బండకుమార్‌, మెకానిక్‌, పుంగనూరు

బడుగులకు బరోసా….

వైఎస్సార్సీపి అధికారంలోకి రావడం హర్షనీయం. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నవరత్నాలలో భాగంగా బలహీన వర్గాలకు బరోసా కల్పిస్తూ మహిళలకు రూ.75 వేలు పంపిణీ చేయనుండటం హర్షనీయం. అలాగే అమ్మ బడి క్రింద స్కూల్‌ పిల్లలు రూ.15 వేలు , వైఎస్సార్‌ పెళ్లికానుక క్రింద ఆడపడుచులకు లక్షరూపాయలు రానున్నది. ఇలాంటి పథకాలతో పేద ప్రజల అభివృద్ధికి అడ్డు ఉండదు.

– అద్దాలనాగరాజ, బీసీ సంఘ అధ్యక్షుడు, పుంగనూరు

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఘనస్వాగతం

Tags: With Jagannah’s arrival … the gravestones to the poor