ఓడిపోయిన దగ్గరే గెలవాలి

Date:28/05/2019

అమరావతి ముచ్చట్లు:

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా అక్కడి యన్టీఆర్ విగ్రహానికి పులమాలవేసి నివాళులు అర్పించి, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసారు. లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మహనాయకుడు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకెవచ్చిన నత ఎన్టీఆర్ దని అన్నారు. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది. కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు. 2024 లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేస్తానని అన్నారు. ఓడిపోయిన దగ్గరే మళ్ళీ గెలవాలి అనేది నా సంకల్పం. ఎమ్మెల్సీ గా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతా. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. కార్యకర్తల సంక్షేమానికి పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ అని
అన్నారు. ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకి భీమా కల్పించలేదు…అలాంటిది టీడీపీ 70 లక్షల మంది కార్యకర్తలకి భీమా కల్పించింది. మన సేనాధిపతి చంద్రబాబు అయితే, మనం సైనికులం. 2024లో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు.

ఆదోనిలో దొంగల హల్ చల్

Tags: You must win at losing