ముస్లింలకు గుర్తింపు ఇచ్చిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

Date:12/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రి వర్గంలో ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, గుర్తింపు ఇచ్చారని పుంగనూరు ముస్లిం నాయకులు అజీజ్‌, అయూబ్‌ఖాన్‌, ఎంఎస్‌.సలీం, ఖాదర్‌ లు కొనియాడారు. బుధవారం ముస్లింలు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ముతవల్లి అజీజ్‌ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ముస్లింలను గుర్తించి, ముస్లింల అభివృద్ధి కోసం తొలి నుంచి కృషి చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వాలు ముస్లింల ఓట్లతో పదవులు పొంది ముస్లింలకు గుర్తింపు లేకుండ చేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపి ఎన్నికల ప్రచారంలోనే మైనార్టీలకు ఐదు అసెంబ్లి సీట్లు కేటాయించారని, అందులో నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారని తెలిపారు . మంత్రి వర్గం ఏర్పాటులో కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషాను ఉప ముఖ్యమంత్రిగా నియమించడం , మంత్రి పదవులు అప్పజెప్పడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నాను అనే భరోసాను కల్పించి, ముస్లింల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. భవిష్యత్తులో ముస్లిం మైనార్టీలందరు వైఎస్సార్సీపికి అండగా ఉంటు , వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి జిందాబాద్‌…. డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్షద్‌అలి, పి.మస్తాన్‌, అన్‌సర్‌బాషా, ఫారుల్‌, ఇసుఫ్‌, ఎస్‌.మస్తాన్‌, ముస్టాక్‌, మౌలా, సనమ్‌, ఎస్‌.బాబు, పిరాంసాహెబ్‌, షామీర్‌, గౌసి తదితరులు పాల్గొన్నారు.

 

చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Tags: YS Jaganmohan Reddy, who gave recognition to Muslims

పాలనలో జగన్ దూకుడు 

Date:05/06/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టి వారం రోజులు కూడా కాలేదు. గత నెల 30 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ  వారం రోజుల్లోపే కీలక నిర్ణయాలను తీసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకా సచివాలయంలోకి అడుగుపెట్టని జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచే పాలనను చేపట్టారు.ప్రతిరోజూ వివిధ శాఖల సమీక్షలను చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడంతో ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటున్నారు. ఒకవైపు శాఖలో ప్రక్షాళలన దిశగా చర్యలు తీసుకుంటూనే మరోవైపు తన హామీల అమలుకు జగన్ శ్రీకారం చుట్టారు. ఆశావర్కర్లు గత కొంత కాలంగా తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తున్న ఆశావర్కర్లకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చారు.

 

 

 

 

 

 

 

ఆ హామీ మేరకు మూడు వేల రూపాయలున్న వారి వేతనాలను పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 40 వేల మంది ఆశావర్కర్లు లబ్ది పొందనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపైనే జగన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కన్పిస్తున్నారు. ఈ మూడు రంగాలను గాడిలో పెట్టగలిగితే పాలన గాడిలో పడినట్లేనని జగన్ భావిస్తున్నారు. అందుకే వైద్య ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశావర్కర్ల జీతాలను పెంచారన్నది సీఎం కార్యాలయ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.ఇక వైద్యం, వ్యవసాయనికి ప్రధానమైన జలవనరుల శాఖపై కూడా సీఎం జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ శాఖలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడిటెక్ జోన్ లో జరిగిన అవకతవకలపై నివేదికను ఆ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఆదేశించారు. అలాలే పోలవరం ప్రాజెక్టు పనులు ఏ మాత్రం ఆగకుండా పూర్తి చేసి, అనుకున్న సమయానికి రైతాంగానికి నీరు అందించాలని నిర్ణయించారు. వారం రోజుల్లోనే కీలక నిర్ణయాలను తీసకుంటూ పాలనను గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు నూతన ముఖ్యమంత్రి జగన్.

 

బిగ్ బాస్ 3 లో నాగబాబు

Tags:Jagan’s aggression in governance

జగన్ కేబినెట్ పై చర్చోపచర్చలు

Date:29/05/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రివర్గ కూర్పుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా ? లేదా ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా అప్పుడే ప్రమాణస్వీకారం చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్. జగన్ పార్టీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో చాలా మంది సీనియర్లు, జూనియర్లు, జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెనకే నడుస్తున్నవారు ఉన్నారు. కొంతమంది నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ మంత్రి పదవులకు, ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్లి మరి విజయం సాధించారు. వివిధ జిల్లాల నుంచి గెలిచిన వారిలో చాలా మంది సీనియర్లు ఉండడంతో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. దీంతో జగన్ ఎవరెవరికి కేబినెట్ బెర్త్‌లు ఇస్తారన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా ఉంది.జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, విశ్వస‌న‌రాయ కళావతి రేసులో ఉన్నారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ, రాజన్న దొర, పుష్ప శ్రీ వాణి, కోలగట్ల వీరభద్రస్వామి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. విశాఖ నుంచి గొల్ల బాబురావు, గుడివాడ అమర్నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, అవంతి శ్రీనివాస్ ఆశిస్తున్నారు. తూర్పుగోదావరిలో బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, దాడిశెట్టి
రాజా, కుర‌సాల‌ కన్నబాబు ప్రముఖంగా రేసులో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎస్సీ కోటాలో తెల్లం బాలరాజు, కాపు కోటాలో ఆళ్లనాని లేదా గ్రంధి శ్రీనివాస్‌లలో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చు. అదే జిల్లాలోని తానేటి వనిత ఎస్సీ మహిళా కోటాలో కేబినెట్ రేసులో ఉన్నారు.ఇక కృష్ణాజిల్లాలో కొడాలి నాని, సామినేని ఉదయభాను, పేర్ని నాని పేరు కూడా వినిపిస్తోంది.

 

 

 

ఇక వెల‌మ‌ సామాజికవర్గం నుంచి నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు రేసులో ఉన్నారు. గుంటూరులో ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవులు ఖాయమయ్యాయి. అలాగే ఎస్సీ మ‌హిళా కోటాలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచ‌రిత పేరు కూడా వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి ఖాయం అవ్వగా… యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. నెల్లూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి రేసులో ఉన్నారు. కడప నుంచి మైనార్టీ కోటాలో అంజాద్ భాషా,
శ్రీకాంత్ రెడ్డి పదవులు ఆశిస్తున్నారు.చిత్తూరు నుంచి ఆర్‌కే. రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలలో ఇద్దరికి పదవులు రానున్నాయి. కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీదేవితో పాటు మైనార్టీ కోటాలో మ‌హ్మ‌ద్‌ హ‌ఫీజ్‌ ఖాన్ పేరు వినిపిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణల‌లో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చు. అలాగే కాపు రామచంద్రారెడ్డి సైతం రేసులో ఉన్నారు. ఏదేమైనా కేబినెట్ లో జగన్ కాక మరో 25 మందికే ఛాన్స్ ఉంటుంది కానీ ప్రతి జిల్లా నుంచి ముగ్గురు నుంచి నలుగురు వరకు కేబినెట్ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఫైనల్ గా జగన్ ఎవరికి మంత్రి ప‌ద‌వులు కల్పిస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

 

టార్గెట్ పెట్టీ మరీ సాధించారు…

Tags: Talks on Jagan’s Cabinet

జనం మెచ్చిన నేత జగన్‌ …

– మేదావి వర్గం హర్షం

Date:27/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్సీపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జనంమెచ్చిన నేతగా పేరు సాధించారని మహిళలు , మేదావి వర్గం సంపూర్ణ మద్దతుతో ముఖ్యమంత్రిగా వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికైయ్యారని ప్రముఖులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రవేశపెట్టని పథకాలను ప్రవేశపెట్టి , ఎన్నికలకు ముందుగానే ప్రజల మనుసుల్లో స్థానం సంపాదించి రాష్ట్ర చరిత్రలో తిరుగులేని మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్ఠిస్తున్న ఏకైక వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసిస్తున్నారు. నవరత్నాలలో ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకం క్రింద రైతులకు రూ.50 వేలు పెట్టుబడితో పాటు పంటకు రూ.12,500లు చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంటల భీమాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వడ్డీలేని రుణాలు, ఉచిత బోర్లు, 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇవ్వనున్నారు. అలాగే ఆరోగ్య శ్రీ పథకం క్రింద రూ.1000లు దాటితే ఆరోగ్య శ్రీ క్రింద ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారు. కిడ్నీ, తలసిమియా వంటి రోగులకు ప్రతి నెల రూ.10 వేల పెన్షన్‌ అందించనున్నారు. బడికి పంపే పిల్లల తల్లిదండ్రులకు సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పోరేషన్‌ ద్వారా రుణాలు, 45 సంవత్సరాలు దాటిన వారికి కార్పోరేషన్‌ ద్వారా రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులు చదివే వారికి పూర్తి రియంబర్స్మెంట్‌ , పేదలందరికి రాష్ట్రంలో 25 లక్షల పక్కా ఇండ్ల నిర్మాణం , యువతకు ఉపాధి, వృద్ధులకు రూ.3 వేలు పెన్షన్లతో పాటు మధ్యపాన నిషేదం పూర్తిగా నిషేదం అభినందనీయ పథకాలు. ప్రజలు వీటికి ముక్దులై ఓట్ల వర్షం కురిపించారని కొనియాడారు.

నవరత్నాలు …

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టనున్న నవరత్నాల పథకాలు నవరత్నాలు లాంటివి ఆయన మాటలపై విశ్వసనీయత, నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. రాష్ట్ర నికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. వైఎస్సార్సీపి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని చిరస్థాయిగా నిలవాలని కోరుకుంటున్నా.


– డాక్టర్‌ సరళ, పుంగనూరు

నమ్మకానికి చిరునామ వైఎస్‌ కుటుంబం…

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామిలను నేరవేర్చి, ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించుకున్నారు. అలాగే ఆయన తనయుడు వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తానని ప్రకటించడం హర్షనీయం. నమ్మకానికి, విశ్వసనీయతకు చిరునామ వైఎస్‌ కుటుంబం.

– డాక్టర్‌ లక్ష్మి సంగీత, గైనకాలజిస్ట్ , పుంగనూరు

కష్టాలు కనపడవు ….

రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్న కష్టాలు తీరిపోనున్నాయి. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలు రాష్ట్ర చరిత్రను తిరగరాస్తుందనడంలో సందేహం లేదు. ప్రజలే జగన్‌… జగన్‌నే జనం…అన్న నినాదంతో జీవిస్తున్నారు.

– డాక్టర్‌ నిరుపమారెడ్డి, పుంగనూరు

అందరికి వైఎస్‌ఆర్‌ బరోసా….

వైఎస్సార్సీపి పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పదవి స్వీకారం చేయడం అభినందనీయం. పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌ బరోసా లబిస్తోంది. కులమతాలకతీతంగా ఏర్పాటు చేసిన మ్యానిఫేస్టోను ప్రజలు స్వాగతించి, వైఎస్సార్సీపికి బ్రహ్మరథం పట్టారు. జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం దేశ చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాం.

– ఎలినార్‌ ప్రశాంతి, న్యాయవాది, పుంగనూరు

ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని సన్మానించిన చింతపండు వ్యాపారులు

Tags: Leading Leader Jagan …

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ సీఎం కెసిఆర్‌

Date:25/05/2019

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఆం్య ధ్ర రా ష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబోతున్న వైఎస్సార్సీపి అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దంపతులు ఘనంగా సత్కరించారు. శనివారం వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయ సతీమణి భారతిరెడ్డి , ఎంపిలు విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డిలు కలసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో కెసిఆర్‌ తనయుడు కెటిఆర్‌ దంపతులు కలసి జగన్‌కు స్వాగతం పలికారు. కెసిఆర్‌ జగన్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. స్వయంగా మిఠాయిలు తినిపించారు. తరువాత జగన్‌కు కెసిఆర్‌ శాలువకప్పి సన్మానించి, కెసిఆర్‌ ఇంటిలో ఉన్న తెలంగాణ మంత్రులను జగన్‌కు పరిచయం చేశారు. ఇరువురు ముచ్చటించుకున్నారు.

 

పతుల కోసం సతుల ప్రచారం

Tags: Welcome to YS Jaganmohan Reddy Telangana CM KCR

జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్….

Date:24/05/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

151అసెంబ్లీ సీట్లతో భారీ మెజార్టీతో గెలచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న చేయనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని విశ్వసనీయంగా తెలిసింది. విజయవాడలో జరిగే కార్యక్రమానికి రావాలని జగన్ ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి కేసీఆర్ సానుకూలత వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఏపీలో చంద్రబాబు నాయుడు కు రిటన్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 9స్థానాల్లో విజయం సాధించిన.

 

సదరన్ క్యాపు ప్రారంభించిన ములుగు కలెక్టర్  నారాయణరెడ్డి

Tags: KCR to Jagan’s swearing in ….

పేదల ముంగిటకు నవరత్నాలు

– వైఎస్సార్‌సీపీ ప్రచారాల జోరు

 

Date:01/04/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో పేదలు ఎంతో అభివృద్ధి చెందుతారని, నవరత్నాలను పేదల ముంగిటకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పార్టీ శ్రేణులు పేర్కొంటు ప్రచారాలు జోరు చేశారు. సోమవారం పట్టణంలో పార్టీ అభిమానులు విడివిడిగా వార్డులలో ప్రచారాలు చేశారు. పట్టణంలోని ఎల్‌ఐసి కాలనీ, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో డాక్టర్లు శివ, శరణ్‌, కౌన్సిలర్‌ మనోహర్‌, మాజీ కౌన్సిలర్‌ బిటి అతావుల్లా, పెన్షనర్లు చెంగారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, రఘుపతి, ఆర్యవైశ్య సంఘ నాయకులు బాలసుబ్రమణ్యం, శ్రీధర్‌, వెంకటేష్‌, త్రిమూర్తిరెడ్డి లు ప్రచారం చేశారు. అలాగే విశ్రాంత మిలటరీ ఉద్యోగులు క్రిష్ణప్ప, సుబ్రమణ్యం, నాగరాజారెడ్డి, హరిమౌలి, హనుమంతు, గౌస్‌బాష, గణేష్‌, శ్రీనివాసులు, నానబాలమణి కొత్తయిండ్లలో ప్రచారం చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, అజ్ముతుల్లా, రాజగోపాల్‌ ఆధ్వర్యంలో కట్టక్రిందపాళ్తెంలో ప్రచారాలు చేశారు. చింతలవీధిలో కౌన్సిలర్‌ దివ్యలక్ష్మి, కుమార్‌ ప్రచారం చేశారు. అలాగే తేరువీధిలో మహిళా నాయకురాలు రెడ్డెమ్మ, కిషోర్‌లు ప్రచారం చేశారు. కుమ్మరవీధిలో యువజన సంఘ నాయకుడు అస్లామురాధి ఆధ్వర్యంలో ప్రచారాలు చేశారు. గాంధినగర్‌లో కౌన్సిలర్‌ నయాజ్‌, మైనర్టీ నాయకులు గౌస్‌ ఆధ్వర్యంలో ప్రచారాలు చేశారు. తాటిమాకులపాళ్యెంలో పార్టీ నేతలు నటరాజ, గోపి ఆధ్వర్యంలో యువకులు ఇంటింటా ప్రచారం చేశారు. అలాగే బజారువీధి, సుబేదారువీధిలో ఆర్యవైశ్య సంఘ నాయకులు ముల్లంగి విజయకుమార్‌ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు.

 

 

 

 

 

 

 

 

అలాగే ఎన్‌ఎస్‌.పేటలో కౌన్సిలర్లు రేష్మా, మంజుల ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఉబేదుల్లాకాంపౌండు, పోలీస్‌లైన్‌లో మున్సిపల్‌ ఉద్యోగ కార్మికసంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ అమ్ము ప్రచారాలు చేశారు. నానబాలవీధి, కెజిఎన్‌వీధి, చర్చివీధి, కాలువగట్టులో ముస్లిం మహిళలు రహత్‌జాన్‌, రాఫియాసుల్తాన, యాస్మిన్‌, ముబినా, దిల్‌షాద్‌, జరీన్‌తాజ్‌, షాతాజ్‌లు ప్రచారం చేశారు. అలాగే కౌన్సిలర్లు ఇనాయతుల్లాషరీఫ్‌, ఆసిఫ్‌, మైనార్టీ నాయకులు ఇంతియాజ్‌ఖాన్‌, కిజర్‌ఖాన్‌, అంజాద్‌, ఇర్ఫాన్‌లు ప్రచారం చేశారు. హైస్కూల్‌వీధి, ఏవిరావువీధిలో కౌన్సిలర్‌ త్యాగరాజు ప్రచారాలు నిర్వహించారు. కొత్తయిండ్లలో పార్టీ నాయకులు అజ్ముతుల్లా, గురుప్రసాద్‌, హరిప్రసాద్‌, రాజారెడ్డి, కిట్టా ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు.

 

 

 

 

 

 

 

 

ఈస్ట్పేట, తూర్పువెహోగశాలలో కౌన్సిలర్‌ రెడ్డిశేఖర్‌, వైఎస్సార్‌సీపీ కార్యదర్శి ప్రభు, మాలమహానాడు అధ్యక్షుడు అశోక్‌, గణేష్‌ ఆధ్వర్యంలో ప్రచారాలు నిర్వహించారు. మండలంలోని మంగళం కాలనీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి , బాబుస్వామి , రవి ఆధ్వర్యంలో ప్రచారాలు చేశారు. అలాగే నక్కబండలో కో-ఆప్షన్‌మెంబరు ఖాదర్‌బాషా తన అనుచరులతో ప్రచారం చేశారు. అలాగే పార్టీ యువజన సంఘ నాయకుడు రాఘవేంద్రరెడ్డి, యశ్వంత్‌కుమార్‌, షకీల, రషీద ఇంటింటా ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శరణ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికలలో ప్రజలందరు రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుకే వేయాలని కోరారు.

 

సుగుటూరు గంగమ్మ జాతరకు సర్వం సిద్దం

Tags: The gravestones to the poor

అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ రద్దు

-హోం గార్డులకు మెరుగైన జీతాలు
-చిరు వ్యాపారులకు.. ఐడీ కార్డులు. రూ.10 వేల వడ్డీ లేని రుణం
-అదోని సభలో  వైయస్ జగన్ వెల్లడి
Date:25/03/2019
అదోని ముచ్చట్లు:
ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హమీనిచ్చారు. ఉద్యోగులు కోరుతున్నట్లుగా 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని, సకాలంలో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని, సర్వీసు, విద్యార్హతల ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, ఔట్ సోర్సింగ్లో పని చేస్తున్న వారికీ న్యాయం చేస్తూ, సమానపనికి సమాన వేతనాలు చెల్లిస్తామని, పెన్షనర్ల కోసం ప్రతి జిల్లాలో ఒక సెల్ చేస్తామని జగన్ ప్రకటించారు. అదే విధంగా పోలీసు బాస్ లకు చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలు విప్పుతామని, పోలీసులకు వీక్ ఆఫ్ అమలు చేస్తామని, హోం గార్డులకు మెరుగైన జీతాలు ఇస్తామని ఆయన వెల్లడించారు.రోడ్ల పక్కన, ఫుట్పాత్లపైనా చిరు వ్యాపారం చేసుకుంటూ ఎందరో జీవిస్తున్నారని, అలాగే ఎందరో వృత్తిదారులు ఫుట్పాత్లను నమ్ముకుంటూ బతుకుతున్నారని  జగన్ తెలిపారు. వారంతా పెట్టుబడిగా రూ.1000, రూ.2 వేలను కూడా రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీతో తెచ్చుకుంటున్నారని ఆవేదన చెందారు. అందుకే వారి కష్టాలు తీరుస్తూ, చేయూతనిచ్చే విధంగా వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇస్తామని జననేత ప్రకటించారు.
కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఉదయం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పట్టణంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.అదోని నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, పట్టణంలో నాలుగు రోజులకోసారి నీరిస్తున్నారని, ఇక గ్రామాల్లో వారానికోసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. 5 ఏళ్లుగా పరిస్థితి ఇదీ అని అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.ఇదే అదోనిలో గతంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ను మహానేత వైయస్సార్ కట్టాడని, అదే విధంగా అదోనిలో తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు చేపట్టి, మూడు బిట్లు పూర్తి చేయగా, మిగిలిన బిట్టును ఎవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.అదోని రెవెన్యూ డివిజన్ అయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదని, ఉన్న ఒక ఎయిడెడ్ కళాశాలలో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో పిల్లలకు చదువు ఎండమావిలా మారిందని చెప్పారు.ఇక్కడి ఏరియా ఆస్పత్రిలో 14 మంది వైద్యులకు బదులు, కేవలం 5గురు మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు.
తుంగభద్ర లోలెవెల్ కాలువ ఆధునీకరణ కోసం రూ.175 కోట్లు కేటాయించిన మహానేత వైయస్సార్, అప్పట్లోనే రూ.75 కోట్ల పనులు పూర్తి చేయగా, ఆ మిగిలిన పనులను చంద్రబాబు చేపట్టలేదని చెప్పారు. దీంతో ఈ ఏడాది తుంగభద్రలో నీరున్నా రబీలో సాగు లేదని గుర్తు చేశారు. మైనారిటీలకు ఈద్గా సమస్య ఉందని, అయినా దాన్ని పరిష్కరించాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని ఆక్షేపించారు.తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే, 2.65 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు, రెండు జిల్లాలలో 650 గ్రామాలకు మేలు జరుగుతుందని, ఇంకా లక్షల మందికి తాగు నీరివ్వొచ్చని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు ఆ ప్రాజెక్టును అస్సలు పట్టించుకోలేదని అన్నారు. 2014, ఆగస్టు 15న కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని ప్రకటించినా, ఈ 5 ఏళ్లు దాన్ని పట్టించుకోలేదని చెప్పారు. కానీ, ఎన్నికలు రావడంతో గత నెల ఇక్కడికి వచ్చి ప్రాజెక్టు పనులకు టెంకాయ కొట్టాడని ఆక్షేపించారు.చంద్రబాబు ప్రతి అడుగులో మోసం, దగా, వంచన కనిపిస్తాయని, సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడవడంలో ఎందుకు వెనుకాడుతాడని అన్నారు.
దేశంలోనే కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువని, కానీ గత 5 ఏళ్లుగా ఆ ఉల్లికి ధర రాక, పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారని చెప్పారు. ఇక్కడ కిలో ఉల్లికి కనీసం రూ.1.50 గిట్టుబాటు కాకున్నా, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్లో కిలో ఉల్లి రూ.23 కి అమ్ముతున్నారని, ఆ విధంగా దళారుల దోపిడి సాగుతోందని తెలిపారు. దళారీలను కట్టడి చేయాల్సిన చంద్రబాబు స్వయంగా వారికి నాయకుడిగా మారారని ఆరోపించారు. ఉల్లి, టమోటాతో పాటు, పత్తి ధరలు కూడా అలాగే దారుణంగా ఉన్నాయని వివరించారు. వారితో పాటు, కుల వృత్తుల వారు, రోడ్డు పక్కనే ఉన్న కుమ్మరులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, చెప్పులు కుట్టుకునే వారు కావచ్చు.. అందరికి ఒకే మాట చెబుతున్నానని అన్నారు.గుర్తింపు కార్డులు–రుణం‘మీ సమస్యలు చూశాను. దగ్గర నుంచి విన్నాను. మీ అందరికీ నేను ఉన్నాను. అందుకే మీ అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాను. రోడ్డు పక్క చిరు వ్యాపారం చేసుకుంటున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం ఇస్తాము’ అని శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు.దారి పొడవునా కష్టాలు, బాధలు వింటూ నడిచానని, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం చూస్తున్న వారిని చూశానని, నవరత్నాలు ద్వారా వారందరికీ మేలు చేస్తానని వెల్లడించారు.
Tags: The CPS cancels as soon as the power is taken