వైఎస్సార్సీపి సంబరాలు

Date:27/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో వైఎస్సార్సీపి విజయం సాధించడం , పుంగనూరులో వైఎస్సార్సీపి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి , చిత్తూరు ఎంపిగా రెడ్డెప్ప గెలుపొందడం పట్ల పట్టణంలోని ముస్లింలు సంబరాలు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ముస్లిం మైనార్టీ నాయకులు ఇంతియాజ్‌ఖాన్‌, అయూబ్‌ఖాన్‌, ముతవల్లి అజీజ్‌ ఆధ్వర్యంలో నానబాలవీధిలోని ప్రతి ఇంటికి వెళ్లి 600 లడ్డూలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబాన్ని గెలిపించిన ప్రతి ఓటరుకు లడ్డూలు పంపిణీ చేసినట్లు ఇంతియాజ్‌ఖాన్‌ తెలిపారు. అలాగే నక్కబండలో కో-ఆఫ్షన్‌ మెంబర్‌ ఖాదర్‌బాషా, ఆ వార్డులోని ప్రజలతో కలసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ఖాన్‌ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలు మరింతగా అభివృద్ధి చెందుతారని ఆశాబావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంభానికి ఎల్ల వేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నయీమ్‌తాజ్‌, నూర్‌జాన్‌, నగీన, రేష్మా, నజ్మ, నసిమా, షాహనాజ్‌, సుహేబ్‌ఖాన్‌, పర్వీన్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ఇస్టా సదస్సు తెలంగాణకు గర్వకారణం

Tags: Celebrating YSRCP