న్యాయవాదులు విధులు బహిష్కరణ

గూడూరు ముచ్చట్లు:


తెలంగాణ రాష్ట్రం వరంగల్ ప్రాంతంలో న్యాయవాది మల్లారెడ్డి దారుణహత్యకు గురయ్యాడు . న్యాయవాది మల్లారెడ్డి హత్యను ఖండిస్తూ గూడూరు పట్టణంలోని న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు . గూడూరు పట్టణంలోని న్యాయస్థానo భవనముల సముదాయం వద్ద న్యాయవాదులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు . ఈ సందర్భంగా గూడూరు బార్ అసోసియేషన్  కార్యదర్శి వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ బహిరంగంగా న్యాయవాది మల్లారెడ్డి ని హత్య చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు . న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు . న్యాయవాదుల రక్షణ కోసం ఏర్పాటు చేసి ఉన్న  చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో  గూడూరు బార్ అసోసియేషన్  అధ్యక్షుడు ఉమా శంకర్ , న్యాయవాదులు కృష్ణయ్య , తీగల చంద్రశేఖర్ , గోపాల్ రెడ్డి , కోటేశ్వరరావు , సునీల్ తదితరులు పాల్గొన్నారు .

 

Tags: Exclusion of duties of lawyers

 

Leave A Reply

Your email address will not be published.