Natyam ad

సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే రోజా

కడప ముచ్చట్లు:
 
తెలుగు వారికి అతిపెద్ద పండగ సంక్రాంతి సంబంరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. ప్రజలు, ప్రముఖులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా సొంత నియోజకవర్గం నగరిలోనే సంక్రాంతి సంబరాలు చేసుకునే ఎమ్మెల్యే రోజా.. ఈసారి మాత్రం సోదరుడి ఇంట్లో జరుపుకుంటున్నారు. కడప జిల్లా సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తన సోదరుడు, మాజీ జెడ్పీటీసీ ఉపేంద్ర రెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. తెలుగు ప్రజలకు నగరి ఎమ్మెల్యే సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Ms. Rose at the Sankranthi celebrations