కోర్టు ధిక్కరణకు పాల్పడిన తహశీల్దార్, రెవెన్యూ అధికారులు

ఎస్సి రైతుల భూముల్లో రహదారి ఏర్పాటుకు దౌర్జన్యం
కలెక్టర్  స్పందించి న్యాయం చేయాలని బాధిత రైతుల వినతి
నెల రోజులు మానసికంగా వేధిస్తున్నారని బాధిత రైతుల ఆరోపణలు
దౌర్జన్యం చేస్తున్న వీడియోను తీస్తుంటే ఫోన్ కూడా లాక్కున్నారని ఆవేదన
స్థానిక అధికారులను సస్పెండ్ చేయాలని వినతి

జి.కొండూరు ముచ్చట్లు:

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో ఎస్సీ రైతులకు చెందిన భూములలో అక్రమంగా రహదారి ఏర్పాటుకు  జి.కొండూరు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. తమ సొంత భూమిలో రహదారి ఏర్పాటు చేయవద్దని బాధిత రైతులు మైలవరం న్యాయస్థానాన్ని గత నెల ఆశ్రయించారు. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.జి.కొండూరు తహశీల్దార్ ఇంతియాజ్ పాష,  వీఆర్వో రమేష్ సచివాలయ రెవెన్యూ అధికారిని నీరజ బుధవారం సాయంత్రం సదరు భూమిలోకి వెళ్లి బాధిత రైతులను బెదిరించడంతో వారు ఎదురు తిరిగారు. చేసేదిలేక రెవెన్యూ అధికారులు అక్కడ నుండి జారుకున్నారు.
గడ్డమనుగు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి  పండు, ప్రత్తిపాటి విలియం జోసెఫ్ అలియాస్ బుజ్జిలకు చెందిన మెట్ట భూముల్లో అక్రమంగా కొంతమంది రైతులు సిండికేట్లుగా మారి  రెవెన్యూ అధికారులకు ముడుపులు అప్పజెప్పి రహదారి ఏర్పాటుకు అక్రమ పద్ధతుల ద్వారా కుట్ర పన్నారని రైతులు ఆరోపించారు.

 

 

 

Post Midle

జి.కొండూరు మండల తహశీల్దార్ ఇంతియాజ్ పాష, విఆర్వో రమేష్, సచివాలయ విఆర్వో నీరజలు అక్రమంగా రహదారి ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు బాధిత రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. గత నెల రోజుల నుండి తమను మానసికంగా వేధిస్తూ, ఇబ్బందులు పెడుతున్నట్లు, తమకు చావే శరణ్యమని  బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన మండల రెవెన్యూ అధికారి, సిబ్బందిపై ప్రభుత్వం, జిల్లా రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.బాధిత రైతులు మాట్లాడుతూ సిండికేట్ అయిన రైతులు పులి వాగును ఆక్రమించి గత కొన్ని ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని వారి భూములలోకి వెళ్లేందుకు మునగపాడు ఎత్తిపోతల పథకం నుండి మరో రహదారి ఉందన్నారు. అక్కడి నుండి రహదారి ఏర్పాటు చేస్తే మోటార్ గడ్డ డ్యామ్ వరకు వెళ్ళటానికి ఉపయోగపడుతుందని, అలాగే వర్షాకాలంలో అక్కడ ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేసిన లాకులు ఎత్తటానికి, దించటాన్కి ఉపయోగపడుతుందన్నారు. అదే ప్రాంతంలో  డొంక ఉందని వారు పేర్కొన్నారు. ఇది కూడా ఉపయోగపడుతుందని బాధిత రైతులు పేర్కొన్నారు.

 

గత వందేళ్ల నుండి రైతులు తమ పొలాల్లోకి వెళ్ళటానికి ఇతర రహదారులలో  తమ భూమి మధ్యలో నడచి వెళ్ళినట్టు బాధిత రైతులు గుర్తు చేశారు. తమ పంట పొలాల్లో రహదారి ఏర్పాటు చేయవద్దని బాధిత రైతులు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని  ఆరోపించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేస్తూ గడ్డమణుగు గ్రామానికి చెందిన ఎస్సీ రైతులను రెండు వర్గాలుగా విభజించి పాలిస్తూ ఉన్నట్లు బాదిత రైతులు వాపోయారు.సదరు బాధిత రైతులు మైలవరంలో న్యాయస్థానాన్ని గత మే నెలలో ఆశ్రయించినప్పటికీ రెవిన్యూ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారు తక్షణమే స్పందించి తమను  మానసికంగా వేధిస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

 

Tags: Tahsildar and Revenue officials guilty of contempt of court

Post Midle
Natyam ad