Tailors come to life with ready-made clothing

రెడీమెడ్‌ దుస్తులతో టైలర్ల జీవనానికి గండి

– టైలర్ల దినోత్సవంలో ఆవేదన

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో టైలర్స్డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలో టైలర్లు తెల్లటి దుస్తులు ధరించి ప్యాలెస్‌ ఆవరణం నుంచి బయలుదేరి తేరువీధి, సెంటర్‌లాడ్జి, నాగపాళ్యెం, ఇందిరాసర్కిల్‌, బస్టాండు, గోకుల్‌సర్కిల్‌, ఎంబిటి రోడ్డు మీదుగా అంబేద్కర్‌ భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టైలర్ల సంఘ నాయకుడు ఖాసీం మాట్లాడుతూ రెడీమెడ్‌ దుస్తులు మార్కెట్‌లో అధిక స్థాయిలో రావడంతో టైలర్ల జీవనోపాధికి విఘాతం కలుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరు రెడీమెడ్‌ దుస్తులకు ఆకర్షితులౌతుండటంతో పని తగ్గిందని, దీని కారణంగా టైలర్లు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టైలర్లకు పెన్షన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే టైలర్లకు రుణాలు, కమ్యూనిటి హాల్‌, గృహాలు , రేషన్‌కార్డులు, భీమా సౌకర్యం మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు అమరనాథ్‌, సంఘ నేతలు చంద్ర, సురేంద్ర, అస్లాం, షమి, అల్లి, గౌస్‌, మహబూబ్‌బాషా, రాజ, మనోహర్‌, అల్లాభక్షు, సుదర్శన్‌, గురుమూర్తి, హైదర్‌ తదితరులు పాల్గొన్నారు.

 పెండింగ్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం

Tags: Tailors come to life with ready-made clothing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *