ఘనంగా జరిగిన టైలర్స్ డే

Date;28/02/2020

 

ఘనంగా జరిగిన టైలర్స్ డే

ఎమ్మిగనూరుముచ్చట్లు:

ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం  టైలర్స్ యూనియన్  గౌరవ అధ్యక్షుడు  తిక్క రెడ్డి ఆధ్వర్యంలో టైలర్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. యూనియన్ పట్టణ సంఘం  అధ్యక్షులు.  నాగభూషణం(ప్రిన్స్ టైలర్). అధ్యక్షతన ఏర్పాటుచేసిన  టైలర్స్ దినోత్సవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాప్  శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్  హేమంత్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు, అనంతరం యూనియన్  ఆధ్వర్యంలో శివ సర్కిల్ నుండి, సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా టైలర్స్ డే నిర్వహిస్తున్నామని ఆరోజు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,  రోగులకు పాలు బ్రెడ్డు, పేద టైలర్ లకు కుట్టు మిషన్లు, టైలర్ సామాగ్రి సమకూర్చినట్లు  తెలియజేశారు.

Tags;Tailors’ Day

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *