Natyam ad

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  టైలర్స్ డే వేడుకలు

మంథనిముచ్చట్లు:
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుట్టుమిషన్ సృష్టికర్త విలియమ్స్ హు జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రపంచ టైలర్స్ డే వేడుకలను మంథని పట్టణంలోని గాంధీచౌక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్ పంపిణీ చేశారు. మేరు కులవృత్తిలో 60 సంవత్సరాలుగా కొనసాగుతున్న సీనియర్ టైలర్ గూడూరి రాజేందర్ ను బీసీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్, 11వ వార్డు కౌన్సిలర్ వికే. రవి లు  మాట్లాడుతూ ట్రైలర్ షాపులకు ఉచిత కరెంటు అందించాలని, ప్రతి కార్మికునికి జూకి మిషన్లను పంపిణీ చేయాలని, నిరుపేద టైలర్ కార్మికులకు రెండు పడక గదులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంక్షేమ సంఘం నాయకుడు రాయి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ కౌన్సిలర్ కాయితి సమ్మయ్య, మేరు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల తిరుమలయ్య, మేరు సంఘం నాయకులు గట్ల శ్రీకాంత్, మాడిశెట్టి సురేందర్, మంతెన నందు, పెండ్యాల శ్రీధర్, రాపర్తి అఖిల్,మాడిశెట్టి రాజేందర్, గుండొజు ప్రవీణ్, లతోపాటు టైలర్ కార్మికులు కాసిపేట రాజయ్య, ఏరువాక శ్రీనివాస్,మేకల చంద్రయ్య, రామగిరి భాస్కర్, వేముల నగేష్, నాగుల తిరుపతి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Tailors Day Celebrations under the auspices of the BC Welfare Society