పుంగనూరులో టైలర్ల ర్యాలీ
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలో టైలర్స్డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం మోటారు బైకులతో ర్యాలీ నిర్వహించారు. సంఘ నాయకులు ఖాసీమ్, సురేంద్ర, అస్లాం ల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. అలాగే వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. సంఘ నాయకుడు ఖాసిమ్ మాట్లాడుతూ టైలర్లకు ప్రత్యేకంగా కమ్యూనిటి భవనం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని, అలాగే టైలర్లందరికి ఇండ్ల స్థలాలతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్లు నరసింహులు, చంద్ర, నరసింహులు, ఇస్మాయిల్, గౌస్‌బాషా, సురేష్, అతావుల్లా, అల్లాబకాస్, మంజు, మురేషావలి, నిజాముద్ధిన్, శ్రీనివాసులు, రవి, రమేష్‌బాబు, మహబూబ్‌బాషా, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags; Tailors rally in Punganur
