ఎన్.ఎమ్.సి ఫర్ యు” ను సద్వినియోగం చేసుకోండి- కమిషనర్ దినేష్ కుమార్.

నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు నగర పాలక సంస్థ రూపొందించిన “ఎన్.ఎమ్.సి ఫర్ యు” అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని, కార్పొరేషన్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. సోమవారం నాడు కార్యాలయంలో జరిగిన స్పందనలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జరగనున్న ఉత్తమ స్వచ్ఛ పట్టణం పోటీలలో నెల్లూరు నగర కార్పొరేషన్ ఉన్నత ర్యాంకు సాధించేలా ప్రజలంతా సహకరించాలని కోరారు. మరో పదిరోజుల్లో చివరి విడతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెత్త సేకరణ వాహనాలు అందుకోనున్నామని, వంద శాతం డస్ట్ బిన్ ఫ్రీ నగరానికి ప్రణాళికలు సిద్ధం చేసామని తెలిపారు. తడి,పొడి, ప్రమాదకర వ్యర్ధాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించినప్పుడే మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందని, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నామని కమిషనర్ వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 పోటీలలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రజల అభిప్రాయాలు అత్యంత కీలకమైనవని, స్థానికంగా జరుగుతున్న పారిశుధ్య నిర్వహణలో నగర ప్రజలంతా బాధ్యతగా భావించి సహకరించాలని కమిషనర్ ఆకాంక్షించారు.
 
Tags:Take advantage of NMC for you “- Commissioner Dinesh Kumar