ఉపాధి హామి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-ఏపి వ్యవసాయ కార్మిక సంఘం

 

నెల్లూరు ముచ్చట్లు:

 

జాతీయ గ్రామీణా ఉపాధి హామి పధకాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు పేర్కొన్నారు. ఏపి వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో జలదంకి మండలం కమ్మవారిపాలెంలో, ఉపాధి కుాలీలు పని చేసే ప్రాంతాన్ని పరిశీలించటం జరిగింది .ఈ సందర్భంగా దర్గా బాబు మాట్లాడుతూ వామపక్షా పార్టీల సహకారంతో, యుాపిఏ ప్రభుత్వం 25 ఆగష్టు 2005 భారత రాజ్యాంగ ద్వార ఉపాధి హామి పధకం కనీస వేతన చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు. ఉపాధి హామి పధకం ప్రతి ఆర్ధిక సంవత్సరం, దారిద్య్ర రేఖ దిగువనున్న నైపుణ్యం లేని కొద్దిపాటి నైపుణ్యం గల వయెాజనులందకి, ప్రతి గ్రామీణా కుటుంబంలో పని కోరిన వారికి, గ్రామ పరిదిలో 100 రోజులు పని దినాలు  కల్పించాలన్నారు.

 

 

 

కరోనా విపత్కర పరిస్థితిలో గ్రామీణా ప్రాంత వ్యవసాయ కుాలీలు ఉపాధి కోల్పోయిరన్నారు అని, వారికి ప్రభుత్వం ఉపాధి హామి పధకం గ్రామీణ ప్రాంత ప్రజలకు కల్పిస్తుందన్నారు. ఉపాధి హామి పధకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సుాచించారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు  20 కోట్లు కేటాయిస్తుందని  ,కాని మౌళిక సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఉపాధి కుాలీలకు వేసవి అలవేన్స్ మార్చిలో నుాటికి 20% ఏప్రిల్ 30 % ఆదనంగా ఇవ్వాలన్నారు .ప్రతి గ్రుాప్ కి 4 గడ్డపారలు ఇవ్వాలి అని కోరారు. 4 సంవత్సరాల నుండి ఇవ్వటం ఆరోపించారు. గత సంవత్సరం ఉపాధి కుాలీల పెండింగ్ బిల్లులు వేంటనే చెల్లించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి రోజు వారి వేతనం 300 నుండి 390 పెంచిదన్నారు. ఆదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాది కుాలీల వేతనం పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు . ఈ ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆసిస్టింటె వెంకయ్య , రామారావు, వినోద్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Take advantage of the employment guarantee scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *