ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-ప్రముఖ వైద్యులు చిట్నెని రఘు

Date:27/01/2021

జగిత్యాల  ముచ్చట్లు:

మెట్ పల్లి పట్టణంలోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సమీపంలోని శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ( పాత నిత్య సాయి హాస్పిటల్) ఆధ్వర్యంలో గురువారం 28వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తునున్నట్లు, పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు ఇట్టి ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ చిట్నెని రఘు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూత్ర సంబంధిత వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన గర్భసంచి రుతుచక్ర వ్యాధులు వాటి వల్ల కలిగే సమస్యలు అండాశయం ఇన్ఫెక్షన్లు వంటి వాటిని ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. స్కానింగ్ పరీక్షలు కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. ఈ వైద్య శిబిరానికి ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ చిట్నెని హేమా రఘు, గర్భిణీ స్త్రీల వైద్యనిపుణులు సిహెచ్ మాధురి లు హాజరై తమ సేవలను ఉచితంగా అందిస్తారని తెలిపారు.ఈనెల 28వ తేదీన నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం 8331083555,9949049994,9020544471  సంప్రదించవచ్చునని డా. చిట్నెని రఘు తెలిపారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: Take advantage of the free medical camp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *