Date:02/12/2020
:జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల ముచ్చట్లు:
జాతీయ లోక్ అథాలత్ ను డిసెంబర్ 12న కరీంనగర్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్ పర్సన్ నిర్వహిస్తున్నారని, దీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి
బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.కరీంనగర్ లోని కోర్టు ఆవరణలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ ను ఏర్పాటు చేసామని, ఇందులో లీగల్ వ్యవహారాల పట్ల , వారి హాక్కుల పట్ల, భూ సేకరణ కేసుల పట్ల, సివిల్ కేసుల పట్ల, వివాహనికి సంబంధించిన కేసులు పట్ల, గృహ హింస కేసుల పట్ల, క్రిమినల్ కాంపౌండబల్ కేసుల పట్ల ,ప్రీ లిటిగేషన్ కేసుల పట్ల మరియు మొదలగు పెండింగ్ కేసుల పై ప్రజలకు అవగాహన కల్పించటం మరియు పరిష్కరించడం జరుగుతుందని, వారి సమస్యలకు చట్టప్రకారంగా పరిష్కారం కొరకు వారికి సలహా ఇవ్వడం జరుగుతుందని, కావున ప్రజలందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి పేర్కోన్నారు.
పోలీసు జాగిలానికి ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ నివాళి
Tags:Take advantage of the National Lok Athalat