జాతీయ మెగా లోక్అదాలత్ ను సద్వినియోగ పరచుకోండి -మంథని సిఐ.సతీష్      

మంథని ముచ్చట్లు:

ఈ నెల23 నుండి 26వరకు నిర్వహిస్తున్న  జాతీయ మెగా లోక్అదాలత్ ను సద్వినియోగ పరచుకోవాలని          మంథని సిఐ జీ. సతీష్  సూచించారు.  మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కేసులు, పెట్టి కేసులు,డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ప్రకారం మాస్కులు ధరించని, లాక్ డౌన్ కేసులు,ఐ.పి.సి లోని రాజీ అయ్యే అవకాశాలు ఉన్న కేసులు,ఎవరైనా వ్యక్తులు పైన  తెలుపబడిన కేసులతో సంబంధం ఉన్నట్లయితే రానున్న మూడు రోజులు సంబంధిత కోర్ట్ లో పరిష్కరించడం జరుగుతుందన్నారు.  ఇలాంటి కేసులతో సంబంధం ఉన్న వారు మంథని,రామగిరి, ముత్తారం పోలీస్ స్టేషన్లలలో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మంథని:9440795159, సబ్ ఇన్స్పెక్టర్  ఆఫ్ పోలీస్ ముత్తారం:9440795162,  సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామగిరి: 9494318371ని ఈ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 

Tags: Take advantage of the National Mega Lok Adalat – Manthani CI Satish