టోల్ ప్లాజాల వద్ద జాగ్రత్తలు తీసుకోండి

Take care at toll plazas

Take care at toll plazas

Date:12/01/2019
అమరావతి ముచ్చట్లు:
సంక్రాతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని  రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద  వాహనాల  రద్దీ  వల్లే  జరిగే   జాప్యాన్ని నివారించేందుకు సిబ్బంది తగినంత మందిని నియమిం చు కోవాలని రవాణాశాఖ మంత్రి  అచ్చన్నాయుడు ఆదేశించారు. దీనితోపాటు శనివారం, ఆదివారం అలాగే,   తిరుగు ప్రయాణం  సందర్భంగా   టోల్  టాక్స్   ఎత్తివేయాలని  రవాణా  శాఖ   స్పెషల్  చీఫ్  సెక్రటరీ కి   మంత్రి   ఆదేశించారు. రహదారులపై బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదం  జరిగే అవకాశం వున్న ప్రాంతాలవద్ద  రవాణా  అధికారులు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని బస్ స్టాండ్లలో  ప్రయాణికులకు   రద్దీ  దృష్ట్యా   అవసరమైన  అదనపు   బస్సులు  ఏర్పాటు  చేయడం  తోపాటు  ఎలాంటి అసౌకర్యం కలగకుండా  ఆర్ టి సి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చన్నాయుడు ఆదేశించారు.
Tags:Take care at toll plazas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *