వేసవిలో జాగ్రత్తలు తీసుకోండి -కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
వేసవి ప్రారంభంకావడంతో ప్రజలందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి కోరారు. ఆదివారం ఉదయం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి, విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని 31 వార్డులలోను పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పండ్లు, మాంసం దుకాణాలు, హ్గటళ్లలో నిల్వ చేసిన వస్తువులను తినరాదని సూచించారు. పండ్లు చెడిపోయిన వాటిని కత్తరించి జ్యూసులు చేయడం వాటిని విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వ్యాపారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని , చెత్త ఎక్కడపడితే అక్కడ వేయరాదని సూచించారు. వేసవిలో అంటువ్యాదులు ప్రభలే ప్రమాదం ఉందని, వీటిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలుకూడ వేడి నీటిని కాచి సేవించాలన్నారు. దోమలు ప్రభలకుండ మోలాథి న్ స్ప్రేన్ చేసి, ఫాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పించేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటసుబ్బయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags; Take care in summer – Commissioner Narasimhaprasad Reddy
