బీసీ రెసిడెన్షి యల్ స్కూల్ (బాలికలు)తరగతుల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టండి-జిల్లా కలెక్టర్
పులిచెర్ల ముచ్చట్లు:
పులిచెర్ల మండలం నకు మంజూరైన బీసీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) లో ఈ విద్యా సంవత్సరం నుండి తరగతుల నిర్వహణకుఅవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సగిలి సల్మోహన్ సంబంధితఅధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పులిచెర్ల మండలంలో పర్యటించి పులిచెర్ల మండలం నకు మంజూరు కాబడ్డ మహాత్మ జ్యోతి బా పూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ను తాత్కాలికంగా ఎంపీడీఓ,తహసీల్దార్ కార్యాలయం లోనిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యల.పై కలెక్టర్ అధికారులకు తగు దిశా నిర్దేశం చేశారు .ఈవిద్యాసంవత్సరం లోనే తరగతులు ప్రారంభించేలా తగు చర్యలు చేపట్టాలని,అందుకు ఆను గుణంగా భవనం ను సిద్ధం చేసుకోవాలని
సోషల్ వెల్ఫేర్ డిడి రాజ్య లక్ష్మీ మరియు బీసీ వెల్ఫేర్ డిడి రబ్బానీ భాష ని కలెక్టర్ ఆదేశించారు. ఈ గురుకుల పాఠశాల కు శాశ్వత నిర్మాణ భవనాలను నిర్మించేందుకుఅవసరమైన స్థలసేకరణ నిమిత్తం కల్లూరులో స్థల పరిశీలన చేశారు కలెక్టర్.

ఈ పర్యటన లో పులిచెర్ల మండలం లో నూతనంగా నిర్మించినతహసీల్దార్ మరియుఎంపీడీఓ కార్యాలయభవనాలను జిల్లాకలెక్టర్ పరిశీలించి నూతన భవనంలోనికి తాసిల్దార్ మరియు ఎంపీడీఓకార్యాలయాలు మార్పు కావడం ద్వారా పాతఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాలను గురుకుల పాఠశాల ఏర్పాటుకు తగు మరమ్మతులు చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దారుశేషగిరిరావు, ఈవోపీఆర్డి రాజశేఖర్ బాబు,, రాష్ట్రఅటవీ,విద్యుత్, పర్యావరణ,శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పి ఏ తుకారాం,ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి.సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags:Take necessary steps for maintenance of BC Residential School (Girls) classes-District Collector
